Home » Rahul Gandhi
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో డిసెంబర్ 13న ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’ అనే కార్యక్రమం జరుగబోతుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ సందర్భంగా.. అమిత్ షా ఒత్తిడికి లోనయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన సరిగ్గా మాట్లాడలేకపోయారని, చేతులు కూడా వణికాయని చెప్పారు రాహుల్.
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ డిసెంబర్ 15 నుంచి 20 వరకూ బెర్లిన్‌లో పర్యటించనున్నారు. మరోవైపు ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ 19తో ముగియనున్నాయి.
రాహుల్ గాంధీ పీఎంఓ కార్యాలయానికి ఒంటిగంట సమయానికి చేరుకున్నారు. 1.07 నిమిషాలకు సమావేశం ప్రారంభమైంది. సమావేశానంతరం అత్యున్నత పదవులకు మోదీ ప్రతిపాదించిన పేర్లతో విభేదిస్తున్నట్టు రాహుల్ పేర్కొంటూ లిఖితపూర్వకంగా తన అసమ్మతి నోట్‌ను అందజేశారు.
సీఐసీలోని టాప్ పోస్టుల ఎంపికకు పీఎం సారథ్యంలోని కమిటీ బుధవారంనాడు సమావేశమవుతుందని సుప్రీంకోర్టుకు కేంద్రం ఇటీవల తెలియజేసింది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 12(3) కింద చీఫ్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్ నియామకాలకు పేర్లను ఈ కమిటీ ఎంపిక చేసి తమ సిఫార్సులను రాష్ట్రపతికి పంపుతుంది.
ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకే ఈసీని వాడుకుంటున్నారని, క్షేత్ర స్థాయిలో ఎన్నికల సంస్కరణలు అమలు కావడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈసీ నియామకంలో మోదీ, అమిత్‌షాకు ఎందుకంత ఆసక్తి అని ప్రశ్నించారు.
మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీకి అహ్వానం అందలేదని కాంగ్రెస్ వర్గాలు ధ్రువీకరించాయి. కీలక దౌత్య ప్రముఖులు హాజరయ్యే కార్యక్రమంలో తమ నేతలకు ఆహ్వానం లేకపోవడంపై ఆ వర్గాల్లో చర్చ జరుగుతోంది
ప్రభుత్వ గుత్తాధిపత్య విధానాలే ఇండిగో వైఫల్యానికి కారణమని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇందుకు నిస్సహాయ ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని అన్నారు. భారత్‌లోని ప్రతి రంగంలో న్యాయమైన పోటీ అవసరమని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు.
Rahul Gandhi Slams Modi: జులై 9వ తేదీతో భారత్, అమెరికా టారిఫ్ ఒప్పందం రద్దు కానుంది. ఇదే గనుక జరిగితే మళ్లీ ట్రంప్ తెచ్చిన టారిఫ్ విధానాలు భారత్‌కు కూడా వర్తించనున్నాయి.
పార్లమెంట్ సమావేశాల్లో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. పార్లమెంట్ మీటింగ్ హాల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు భుజం నొప్పి వచ్చింది. దీంతో ఆయన ఇబ్బందిపడ్డారు. ఇది గమనించిన రాహుల్ ఆయనకు కొద్దిసేపు మసాజ్ చేశారు.