Home » MLC Kavitha
బీఆర్‌ఎస్‌లోని పెద్ద నాయకుల తీరుపై కొన్ని నెలలుగా అసంతృప్తి వ్యక్తంచేస్తూ వస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్లు, బీఆర్ఎస్‌ను ఖతం చేయాలని చూస్తున్న వారు ఏం మాట్లాడుతున్నారో.. కవిత అదే మాట్లాడుతున్నారని జగదీశ్ రెడ్డి విమర్శించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 4 నుంచి 7 వరకు నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
తాను చేపట్టదలచిన 72గంటల నిరాహార దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల ఆకలికేకలు ఎవరికీ పట్టడం లేదని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పింఛన్ అందక 16 వేల కార్మిక కుటుంబాలు పూట గడవడానికే అవస్థలు పడుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు.
పదేళ్లు అధికారంలో ఉండి, ఏనాడూ బీసీల గురించి మాట్లాడని కవిత.. ఇప్పుడు బీసీల పట్ల ఎంత ప్రేమ ఒలకబోసినా ఎవరూ నమ్మరని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు.
పసుపు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క ఉత్తరం కూడా ఎందుకు రాయలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. నకిలీ విత్తనాలు అమ్ముతుంటే స్థానిక మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు.
ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి నిర్వహించే లీడర్‌షిప్ శిక్షణ కార్యక్రమం ఈ నెల 26న కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభం కానుంది. యువత, మహిళలను నాయకత్వం దిశగా ప్రోత్సహించడమే ఈ శిక్షణ తరగతుల ప్రధాన ఉద్దేశం.
కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు బీసీల రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభ , మండలిలో ఆమోదించి ప్రభుత్వం పంపిందని.. కానీ రిజర్వేషన్‌లకు మతం రంగు పులిమి రాష్ట్రపతి వద్దకు కేంద్ర ప్రభుత్వం పంపలేదని చెప్పుకొచ్చారు.