Train Viral Video: బతుకు, చావుకు మధ్య రెండే సెకన్లు.. ఈ యువతికేమైందో మీరే చూడండి..
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:51 PM
రైలు వస్తుండడంతో యథావిధిగా గేట్లు మూసేశారు. అయినా కొందరు వాహనదారులు గేటు కింద నుంచి దూరి అటు వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ యువతి కూడా సైకిల్ తోసుకుంటూ రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

కొన్నిసార్లు తొందరపాటు అనేది అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. మరికొన్నిసార్లు ఏకంగా ప్రాణాల పోయే పరిస్థితి ఉంటుంది. రైలు ప్రయాణ సమయాల్లో, రైలు పట్టాలు దాటే సమయాల్లో షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి రైలు పట్టాలు దాటుతుండగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ మాలిపూర్ పరిధి అంబేద్కర్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు వస్తుండడంతో యథావిధిగా గేట్లు మూసేశారు. అయినా కొందరు వాహనదారులు గేటు కింద నుంచి దూరి అటు వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి సైకిల్‌పై పట్టాలు దాటి వెళ్లిపోయాడు. అతన్ని చూసి ఓ యువతి కూడా సైకిల్ తోసుకుంటూ రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది.
Train Viral Video: సీటు కోసం ఫీట్లు.. ఏకంగా స్పైడర్ మ్యాన్‌గా మారిపోయాడుగా..
అయితే అప్పటికే రైలు సమీపానికి వచ్చేసింది. వేగంగా వచ్చిన రైలు చూస్తుండగానే (train hit the young woman) ఆ యువతిని ఢీకొని వెళ్లిపోయింది. ఈ ఘటనలో సదరు యువతి అక్కడికక్కడే మృతి చెందింది. యువతి అనూహ్యంగా మృతి చెందడం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
Viral Video: మాట వినకపోతే మటాషే.. భర్తను ఎలా వణికించిందో చూస్తే.. అదిరిపడతారు..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘రెండు నిముషాల కోసం ప్రాణాలు పోగొట్టుకోవడం దారుణం’’.. అంటేూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 500కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Watch Video: టేబుల్‌పై రూ.70 కోట్లు.. ఉద్యోగులకు బంపరాఫర్.. అయితే చివర్లో...
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..