Share News

Watch Video: టేబుల్‌పై రూ.70 కోట్లు.. ఉద్యోగులకు బంపరాఫర్.. అయితే చివర్లో...

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:07 PM

వివిధ కంపెనీలు తమ ఉద్యోగులకు ప్రత్యేకమైన సందర్భాల్లో వివిధ రకాల ఆఫర్లు ఇవ్వడం చూస్తుంటాం. వార్షికోత్సవాలు, పండుగల వేళల్లో బోనస్‌లు, ఇంక్రిమెంట్ల పేరుతో శుభవార్తలు చెబుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరిరవుతుంటారు. అయితే ..

Watch Video: టేబుల్‌పై రూ.70 కోట్లు.. ఉద్యోగులకు బంపరాఫర్.. అయితే చివర్లో...

వివిధ కంపెనీలు తమ ఉద్యోగులకు ప్రత్యేకమైన సందర్భాల్లో వివిధ రకాల ఆఫర్లు ఇవ్వడం చూస్తుంటాం. వార్షికోత్సవాలు, పండుగల వేళల్లో బోనస్‌లు, ఇంక్రిమెంట్ల పేరుతో శుభవార్తలు చెబుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరిరవుతుంటారు. అయితే ఓ కంపెనీ తమ ఉద్యోగులకు బోనస్‌లు, ఇంక్రిమెంట్లు కాకుండా దిమ్మతిరిగే బంపరాఫర్ ఇచ్చింది. టేబుల్‌పై ఏకంగా రూ.70 కోట్లను కుమ్మరించింది. అయితే నగదు తీసుకునే ముందు వారికి ఓ కండీషన్ పెట్టింది. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన చైనాలో (China) చోటు చేసుకుంది. స్థానిక హెనాన్ మైనింగ్ క్రేన్ కో అనే లిమిటెడ్ కంపెనీ.. తమ ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. ఉద్యోగుల ముందు పొడవాటి బేటుల్ ఏర్పాటు చేసి, దానిపై సుమారు 100 మిలియన్ యువాన్ (రూ.70కోట్లు)లను కుమ్మరించింది. టేబుల్ చుట్టూ ఉద్యోగులను నిలబెట్టారు. అయితే ఆ డబ్బులను తీసుకునే ముందు వారికి కంపెనీ ఓ వింత కండీషన్ పెట్టింది.

Traffic Viral Video: ట్రాఫిక్ జామ్ అయినా నో ఫికర్.. ఎద్దుల బండి యజమానిని చూసి అంతా షాక్..


ఉద్యోగులకు 15 నిముషాల సమయం ఇస్తూ.. ఆ సమయంలోగా ఎంత డబ్బు లెక్కపెడితే అంత నగదును మీ ఇంటికి తీసుకెళ్లవచ్చని చెప్పింది. ఇంకేముందీ, ఈ కండీషన్ విన్న ఉద్యోగులు.. ‘‘అరే.. ఇదేదో బాగుందో..’’.. అని అనుకుంటూ తమ చేతులకు పని పెట్టారు. 15 నిముషాల సమయంలోగా ఎవరికి సాధ్యమైనంత రీతిలో (Employees counted cash) వారు నగదును లెక్కపెట్టి బ్యాగుల్లో వేసుకున్నారు. అయితే కొందరు మాత్రం నగుదును లెకక్కిందుకు చాలా ఇబ్బంది పడ్డారు. మరికొందరు ఎంతో వేగంగా లెక్కపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Viral Video: మనువడిపై తాత ప్రేమ.. పరీక్ష కేంద్రం వద్ద ఎలా సాయం చేస్తున్నాడంటే..


ఓ ఉద్యోగి 15 నిముషాల వ్యవధిలో 11 లక్షలకు పైగా నగుదును లెక్కపెట్టాడని తెలిసింది. మొత్తానికి తమ ఉద్యోగులకు కంపెనీ విచిత్రమైన కండీషన్ పెట్టి, అద్భుతమైన ఆఫర్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆఫర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘డబ్బులకు తగ్గట్లే పని ఒత్తిడి కూడా ఉంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 34 వేలకు పైగా లైక్‌లు, 1.7 మిలియన్‌కు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Maha Kumbh Mela: కుంభమేళాలో అరుదైన ఘటన.. 27 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి.. అకస్మాత్తుగా అఘోరిగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 30 , 2025 | 12:07 PM