Viral Video: ప్రేయసి మాట్లాడుతుంటే ప్రపంచాన్నే మర్చిపోయాడు.. అంతలోనే దూసుకొచ్చిన రైలు.. చివరకు..
ABN , Publish Date - Jan 29 , 2025 | 11:40 AM
ఓ యువకుడు ఎక్కడా స్థలం లేనట్లు రైలు పట్టాలపై కూర్చుని ప్రేయసితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ముందు, వెనుకా ఏం జరుగుతున్నా పట్టించుకోలేని స్థితిలో ఉన్నంతగా ఫోన్‌లో లీనమయ్యాడు. ఇలా ఉండగా ఉన్నట్టుండి..

ప్రేమలో ఉన్న వారు ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. కొందరు ప్రేమికులు ఎవరేమనుకున్నా ఫర్వాలేదు.. అనుకుంటూ బహిరంగ ప్రదేశాల్లోనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. మరికొందరు ఇదే ప్రేమలో పడి అనూహ్య ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ యువకుడు రైలు పట్టాలపై కూర్చుని ప్రేయసితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఇంతలో అటుగా రైలు దూసుకురావడంతో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు ఎక్కడా స్థలం లేనట్లు రైలు పట్టాలపై (man sitting on the train tracks and talking his girlfriend on phone) కూర్చుని ప్రేయసితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ముందు, వెనుకా ఏం జరుగుతున్నా పట్టించుకోలేని స్థితిలో ఉన్నంతగా ఫోన్‌లో లీనమయ్యాడు. ఇలా ఉండగా ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ రైలింజన్ పట్టాలపై అటుగా వచ్చింది.
Funny Viral Video: ఆనందంలో అత్యుత్సాహం అంటే ఇదే.. కొత్త స్కూటీకి పూజలు చేస్తుండగా..
అయినా ఆ వ్యక్తి అదేమీ పట్టించుకోకుండా ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. పట్టాలపై యువకుడు కూర్చోవడాన్ని గమనించిన రైలు డ్రైవర్ (Train Driver).. హారన్ మోగిస్తూనే ఉన్నాడు. అప్పటికీ ఆ యువకుడు కొంచెం కూడా చలనం లేకుండా అలాగే ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. తీరా దగ్గరికి వచ్చాక ఒక్కసారిగా పక్కకు చూసి షాక్ అవుతాడు. దీంతో పైకి లేచి నిలబడతాడు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న రైలు డ్రైవర్.. కిందకు దిగి ఆ యువకుడిని పదే పదే వెంబడిస్తాడు.
రైలు డ్రైవర్ రావడాన్ని గమనించిన ఆ యువకుడు.. అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. ఇలా ఫోన్‌లో మాట్లాడుతూ రైలునే గమనించిన ఈ యువకుడిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రేమలో పడితే ఇలాగే ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘ప్రేయసితో మాట్లాడి ప్రాణం మీదకు తెచ్చుకోవడం అంటే ఇదే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 98వేలకు పైగా లైక్‌లు, 5.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: టెంట్‌లో చలికి వణికిపోతున్న వ్యక్తి.. ఓపెన్ చేసి బయట చూడగా.. షాకింగ్ సీన్..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..