Share News

Bike Driving Video: పొగ ఆవరించినా ముందుకు దూసుకెళ్లాడు.. చివరకు కళ్లెదురుగా ఉన్నది చూసి ఖంగుతిన్నాడు..

ABN , Publish Date - Jan 29 , 2025 | 10:17 AM

ఇద్దరు వ్యక్తులు బైకుపై వెళ్తుండగా మార్గ మధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన కొందరు నిప్పు పెట్టడంతో రోడ్డు మొత్తం పొగ ఆవరించింది. దీంతో దారి కనిపించకుండా మూసుకుపోయింది. అయినా బైకర్ దూసుకెళ్లాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Bike Driving Video: పొగ ఆవరించినా ముందుకు దూసుకెళ్లాడు.. చివరకు కళ్లెదురుగా ఉన్నది చూసి ఖంగుతిన్నాడు..
Biker Hits Buffalo In Smoke

కొందరికి బైకుపై కూర్చుంటే చాలు పూనకం వచ్చేస్తుంటుంది. పది మందిలో తమ ప్రత్యేకత ప్రదర్శించాలనే ఆతృతతో చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. కొందరు సైలెన్సర్ సౌండ్ చేస్తుంటే.. మరికొందరు ఏకంగా బైకుపై నిలబడి డ్రైవింగ్ చేస్తుంటారు. ఇంకొందరైతే బండిని గాల్లోకి లేపి ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తి.. రోడ్డుపై పొగ ఆవరించి ఉండడాన్ని చూసి రయ్యిన దూసుకెళ్లాడు. అయితే చివరకు కనిపించిన దృశ్యం చూసి ఖంగుతిన్నాడు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు బైకుపై వెళ్తుండగా మార్గ మధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన కొందరు నిప్పు పెట్టడంతో రోడ్డు మొత్తం పొగ ఆవరించింది. దీంతో దారి కనిపించకుండా మూసుకుపోయింది. ఇది చూసేందుకు అచ్చం మేఘాలు ఆవరించినట్లు ఉంది.

Viral Video: రైలు వస్తుండగా సడన్‌గా పట్టాల మీద పడిపోయిన యువతి.. క్షణాల వ్యవధిలో ఊహించని ట్విస్ట్.. చివరకు..


పొగను చూడగానే బైకర్‌లో ఒక్కసారిగా ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. ఇంకేముందీ.. బైకును మరింత రైజ్ చేసి పొగలోనే దూసుకెళ్లాడు. మేఘాల్లో తేలిపోయినట్లుగా ఫీలవుతూ బండిని నడిపాడు. అయితే పొగను మొత్తం దాటేయగానే ఎదురుగా గేదెను చూసి షాక్ అయ్యాడు. అయితే అప్పటికే బండి గేదెను (Biker Hits Buffalo In Smoke) ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కిందపడిపోతారు. ఇలా ఏదో చేయాలని చూస్తే.. చివరకు ఇంకేదో జరిగిందన్నమాట.

Viral Video: ఇదేం స్నాక్స్‌రా బాబోయ్.. మిరపకాయలంటేనే భయం పుట్టేలా..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘హీరోలా బిల్డప్ ఇచ్చాడు.. చివరకు జీరో అయ్యాడు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 700కి పైగా లైక్‌లు, 24 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: టెంట్‌లో చలికి వణికిపోతున్న వ్యక్తి.. ఓపెన్ చేసి బయట చూడగా.. షాకింగ్ సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 29 , 2025 | 10:17 AM