Share News

Cattle Farming: ప్రతి నెలా రూ.60 వేల ఆదాయం.. ఈ గేదెలు ఉంటే మీ పంట పండినట్లే..

ABN , Publish Date - Jan 28 , 2025 | 01:05 PM

పాడి పరిశ్రమపై రోజురోజుకూ చాలా మందికి ఆసక్తి పెరుగుతోంది. కొందరు లక్షలు వెచ్చించి వివిధ రకాల జాతులకు చెందిన గేదెలు, ఆవులను కొనుగోలు చేసి మరీ పాడి పరిశ్రమ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రైతుకు సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతోంది..

Cattle Farming: ప్రతి నెలా రూ.60 వేల ఆదాయం.. ఈ గేదెలు ఉంటే మీ పంట పండినట్లే..

కొందరు రైతులు వ్యవసాయంతో పాటూ ఆవులు, గేదెల ద్వారా లక్షల ఆదాయాన్ని గడిస్తున్నారు. కొందరైతే లక్షల జీతాలు వచ్చే ఉద్యోగాలకు వదిలేసి, ఇళ్ల వద్ద పశువులను పెంచుకుంటూ అధిక ఆదాయాన్ని గడిస్తున్నారు. మరికొందరు పాడి రైతులు లక్షలు వెచ్చించి వివిధ రకాల జాతులకు చెందిన గేదెలను కొనుగోలు చేసి ఆదాయాన్ని మరింతగా పెంచుకుంటుంటారు. తాజాగా, ఇలాంటి రైతుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ రైతు జఫరాబాదీ రకం గేదెల ద్వారా నెలకు రూ.60వేల ఆదాయం గడిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే...


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. గుజరాత్‌ (Gujarat) బొటాడ్ జిల్లాలోని ధాసా గ్రామానికి చెందిన సంజయ్ రాథోడ్ అనే రైతు వ్యవసాయంతో పాటూ పశుపోషణ కూడా చేస్తున్నాడు. ఇతడి వద్ద 15కు పైగా పశువులు ఉన్నాయి. అయితే జాఫరాబాదీ జాతికి చెందిన గేదె (Jafarabadi Buffalo) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ గేదె ధర దాదాపు రూ.2లక్షలకు పైగా ధర పలుకుతోందని రైతు తెలిపాడు.

Viral Video: ఇందులో తప్పెవరిది.. రోడ్డు దాటుతున్న వ్యక్తి.. బైకుపై వచ్చి చెంపదెబ్బ కొట్టిన పోలీస్.. చివరకు చూస్తే..


ఈ గేదె రోజుకు రెండు సార్లు చొప్పున మొత్తం 24 లీటర్ల పాలు ఇస్తుందని చెప్పాడు. సదరు రైతు ఒక్కో లీటర్ పాలను రూ.85 చొప్పున విక్రయిస్తున్నాడు. తద్వారా నెలకు రూ.60,000కి పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఈ రకం గేదెల పోషణ పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రైతు సంజయ్ చెబుతున్నాడు. ఈ గేదెలను రోజుకు సార్లు మేత పెట్టాలని, అలాగే రెండు సార్లు ఇతర ఆహార పదార్థాలు అందించాలని చెబుతున్నారు.

Train Stunts Video: రైలింజన్‌పై షాకింగ్ సీన్.. విద్యుత్ పాంటోగ్రాఫ్‌తో ఎలా ఆడుకుంటున్నాడో చూస్తే..


అదేవిధంగా నెలకు ఒకసారి విధిగా పశు వైద్యుడి వద్దకు తీసుకెళ్లి, పరీక్షలు చేయించాలని తెలిపారు. గేదెల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి బాగుంటుందని చెబుతున్నారు. వ్యవసాయంతో పాటూ పశుపోషణ చేయడం ద్వారా అధిక ఆదాయాన్ని గడిస్తున్న సంజయ్.. స్థానిక రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అలాగే మరోవైపు సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్‌గా మారాడు.

Viral Video: పర్వతంపై రాళ్లు తొలగిస్తుండగా షాకింగ్ సీన్.. పెద్ద రాయిని పక్కకు తీసి చూడగా..

Updated Date - Jan 28 , 2025 | 01:05 PM