Share News

Viral Video: రైలు వస్తుండగా సడన్‌గా పట్టాల మీద పడిపోయిన యువతి.. క్షణాల వ్యవధిలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

ABN , Publish Date - Jan 28 , 2025 | 01:52 PM

మెట్రో రైలు కోసం ప్రయాణికులంతా ఫ్టాట్‌పామ్‌పై వేచి చూస్తుంటారు. ఇంతలో రైలు రానే వచ్చేసింది. అయితే రైలు ఫ్టాట్‌పామ్‌పైకి చేరుకుంటుందనగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. రైలు కోసం ఎదురు చూస్తున్న ఓ యువతి..

Viral Video: రైలు వస్తుండగా సడన్‌గా పట్టాల మీద పడిపోయిన యువతి.. క్షణాల వ్యవధిలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

రైలు ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు విన్యాసాలు చేస్తూ ప్రమాదాలకు గురవుతుంటే.. మరికొందరు ఊహించని రీతిలో ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. తాజాగా, ఓ యువతికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైలు వస్తుండగా ఓ యువతి సడన్‌గా పట్టాల మీద పడిపోయింది. క్షణాల వ్యవధిలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మెట్రో రైలు (Metro Train) కోసం ప్రయాణికులంతా ఫ్టాట్‌పామ్‌పై వేచి చూస్తుంటారు. ఇంతలో రైలు రానే వచ్చేసింది. అయితే రైలు ఫ్టాట్‌పామ్‌పైకి చేరుకుంటుందనగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. రైలు కోసం ఎదురు చూస్తున్న ఓ యువతి ధబేల్‌మని ఒక్కసారిగా రైలు పట్టాలపై పడిపోతుంది.

Cattle Farming: ప్రతి నెలా రూ.60 వేల ఆదాయం.. ఈ గేదెలు ఉంటే మీ పంట పండినట్లే..


యువతి సడన్‌గా పట్టాలపై పడిపోవడంతో (young woman fell on the train tracks) అక్కడున్న ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలో మెట్రో రైలు కూడా సమీపానికి వచ్చేస్తుంది. దీంతో యువతిని కాపాడేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోతారు. అయితే కొందరు ప్రయాణికులు తమ చేతిలోని బ్యాగులు ఊపుతూ రైలును ఆపమని కోరతారు. పట్టాలపై యువతిని గమనించిన రైలు డ్రైవర్.. సడన్‌ బ్రేక్ వేసి రైలును ఆపేస్తాడు.

Viral Video: ఇందులో తప్పెవరిది.. రోడ్డు దాటుతున్న వ్యక్తి.. బైకుపై వచ్చి చెంపదెబ్బ కొట్టిన పోలీస్.. చివరకు చూస్తే..


రైలును ఆపేయడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఈ యువతి టైం ఎంతో బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘ఫ్టాట్‌పామ్‌పై ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 26వేలకు పైగా లైక్‌లు, 16.9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Train Stunts Video: రైలింజన్‌పై షాకింగ్ సీన్.. విద్యుత్ పాంటోగ్రాఫ్‌తో ఎలా ఆడుకుంటున్నాడో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 28 , 2025 | 01:52 PM