Viral Video: ఇదేం స్నాక్స్‌రా బాబోయ్.. మిరపకాయలంటేనే భయం పుట్టేలా..
ABN , Publish Date - Jan 29 , 2025 | 09:24 AM
ఓ వ్యక్తి తోపుడు బండిపై మిరపకాయలు పెట్టుకుని విక్రయిస్తు్న్నాడు. అంతా వాటిని కేజీల లెక్కన విక్రయిస్తున్నాడని అనుకున్నారు. కానీ దగ్గరికి వెళ్లి చూడగా.. అతను చేస్తున్న నిర్వాకం ఖంగుతినిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..

వింత వింత రెసిపీలతో వినూత్న ఆహార పదార్థాలను తయారు చేసే వాళ్లను నిత్యం చూస్తుంటాం. కొందరు ఎర్ర చీమలతో చట్నీ చేస్తే.. మరికొందరు వేపాకులతో సమోసాలు చేసే వారిని కూడా చూస్తుంటాం. అలాగే ఇంకొందరు గుడ్డుతో పాప్‌కార్న్ చేయడం కూడా చూశాం. ఇలాంటి విచిత్ర రెసిపీలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మిరపకాయలతో ఓ వ్యక్తి చేసిన స్నాక్స్ చూసి అంతా కళ్లు తేలేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘మిరపకాయలంటేనే భయం పుట్టేలా.. ఇదేం స్నాక్స్‌రా బాబోయ్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తోపుడు బండిపై మిరపకాయలు పెట్టుకుని విక్రయిస్తు్న్నాడు. అంతా వాటిని కేజీల లెక్కన విక్రయిస్తున్నాడని అనుకున్నారు. కానీ దగ్గరికి వెళ్లి చూడగా.. అతను చేస్తున్న నిర్వాకం ఖంగుతినిపించింది. చేతి నిండా మిరపకాయలను తీసుకున్న అతను.. వాటిని పక్కనే ఉన్న చిన్న బకెట్‌లో వేశాడు.
తర్వాత అందులో కొత్తిమీర ఉప్పు, కొన్ని మసాలా దినుసులు వేశాడు. చివరగా టమోటా సాస్ కూడా కలిపాడు. ఆ తర్వాత వాటిని రోటిలో దంచిన తరహాలో చక్కెతో ముక్కలు ముక్కలు చేస్తాడు. ఇలా ముక్కలు చేసిన తర్వాత వాటిని బాగా కలియతిప్పి, ఓ కప్పులో వేస్తాడు. చివరగా దానిపై కొత్తిమీరతో (Snacks with chilies) గార్నిష్ చేసి కస్టమర్‌కు అందిస్తాడు. ఇది తర్వాత ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మిరపకాయలతో ఇదేం స్నాక్స్‌రా బాబూ’’.. అంటూ కొందరు, ‘‘దీన్ని తింటే ఒళ్లంతా మంట ఖాయం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 34 వేలకు పైగా లైక్‌లు, 3.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: టెంట్‌లో చలికి వణికిపోతున్న వ్యక్తి.. ఓపెన్ చేసి బయట చూడగా.. షాకింగ్ సీన్..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..