Share News

Viral Video: టెంట్‌లో చలికి వణికిపోతున్న వ్యక్తి.. ఓపెన్ చేసి బయట చూడగా.. షాకింగ్ సీన్..

ABN , Publish Date - Jan 29 , 2025 | 08:03 AM

ఓ వ్యక్తి టెంట్‌లో పడుకుని చలికి వణికిపోతూ కనిపించాడు. చలికి తాను ఇబ్బంది పడుతున్నట్లుగా కెమెరా ముందు కనిపించాడు. స్వెట్టర్, చేతులకు గ్లౌజులు వేసుకున్నా కూడా అతను చలికి ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ..

Viral Video: టెంట్‌లో చలికి వణికిపోతున్న వ్యక్తి.. ఓపెన్ చేసి బయట చూడగా.. షాకింగ్ సీన్..

టెంట్ వేసుకోవడం ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. క్యాంపింగ్‌, టెంట్ వీడియోలకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది జలపాతాలు, అడవులు, మంచు కురిసే ప్రదేశాల్లో టెంట్ వేసుకోవడం ఫ్యాషన్‌గా మారింది. కొందరు క్యాంపింగ్‌కు కష్టతరమైన ప్రదేశాల్లోనూ టెంట్ వేస్తూ.. వారి అనుభవాలను వీడియోల రూపంలో అందిస్తుంటారు. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ వ్యక్తి టెంట్‌లో చలికి వణికిపోతూ కనిపించాడు. అయితే చివరకు దాన్ని ఓపెన్ చేసి బయట చూడగా షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి టెంట్‌లో పడుకుని చలికి వణికిపోతూ కనిపించాడు. చలికి తాను ఇబ్బంది పడుతున్నట్లుగా కెమెరా ముందు కనిపించాడు. స్వెట్టర్, చేతులకు గ్లౌజులు వేసుకున్నా కూడా అతను (man shivering with cold in tent) చలికి ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే అంతా అవాక్కయ్యే సంఘటన చోటు చేసుకుంది.

Viral Video: రైలు వస్తుండగా సడన్‌గా పట్టాల మీద పడిపోయిన యువతి.. క్షణాల వ్యవధిలో ఊహించని ట్విస్ట్.. చివరకు..


చలికి వణికిపోతున్న అతను.. ఆ తర్వాత మూసి ఉన్న టెంట్ ద్వారానా మెల్లగా తెరుస్తాడు. బయటి వైపు మంచు కురుస్తున్న అందమైన దృశ్యాలను చూడవచ్చని అంతా అనుకుంటారు. అయితే టెంట్‌ ద్వారాన్ని తెరవగానే.. బయటి వైపు దృశ్యాలు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. మంచు వర్షానికి బదులుగా (clothing store) దుకాణంలోని దుస్తులు కనిపిస్తాయి. దీన్నిబట్టి అతను మంచు ప్రదేశంలో కాకుండా ఓ దుస్తుల దుకాణంలో టెంట్ వేసుకుని, చలికి వణికిపోతున్నట్లు నటిస్తున్నట్లు అర్థం అవుతుంది.

Viral Video: ఇందులో తప్పెవరిది.. రోడ్డు దాటుతున్న వ్యక్తి.. బైకుపై వచ్చి చెంపదెబ్బ కొట్టిన పోలీస్.. చివరకు చూస్తే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి దృశ్యాలు చూస్తామని అస్సలు ఊహించలేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలత ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.84 లక్షలకు పైగా లైక్‌‌లు, 37.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పర్వతంపై రాళ్లు తొలగిస్తుండగా షాకింగ్ సీన్.. పెద్ద రాయిని పక్కకు తీసి చూడగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 29 , 2025 | 08:03 AM