Viral Video: మనువడిపై తాత ప్రేమ.. పరీక్ష కేంద్రం వద్ద ఎలా సాయం చేస్తున్నాడంటే..
ABN , Publish Date - Jan 30 , 2025 | 09:19 AM
ఓ పరీక్ష కేంద్రంలో విద్యార్థులంతా పరీక్షలు రాస్తున్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. పరీక్ష కేంద్రం ముందు నుంచి చూస్తే అంతా బుద్ధిగా పరీక్షలు రాస్తున్నట్లే కనిపించింది. అయితే ఆ బిల్డింగ్ వెనుక వైపు వెళ్లి చూడగా..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో విద్యార్థులకు సంబంధించిన వీడియోలు తెగ హల్‌చల్ చేస్తుంటాయి. క్లాస్ రూముల్లో విచిత్ర విచిత్రంగా ప్రవర్తించే విద్యార్థులను నిత్యం చూస్తుంటాం. అలాగే పరీక్ష రాసే సమయంలోనూ విద్యార్థులు కాపీలు కొట్టేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా, పరీక్ష రాస్తున్న విద్యార్థికి.. తన తాత సాయం చేసే వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పరీక్ష కేంద్రంలో విద్యార్థులంతా పరీక్షలు రాస్తున్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. పరీక్ష కేంద్రం ముందు నుంచి చూస్తే అంతా (Students writing exams) బుద్ధిగా పరీక్షలు రాస్తున్నట్లే కనిపించింది. అయితే ఆ బిల్డింగ్ వెనుక వైపు వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది.
Maha Kumbh Mela: కుంభమేళాలో అరుదైన ఘటన.. 27 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి.. అకస్మాత్తుగా అఘోరిగా..
విద్యార్థులందరికీ వారి తండ్రులు, స్నేహితులు కాపీలు అందించడం కనిపించింది. విద్యార్థులు కిటికీల వద్ద నిలబడి, కింద నుంచి అందిస్తున్న కాపీలను తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వృద్ధుడు తన మనువడికి కాపీలు అందించేందుకు అక్కడికి వచ్చాడు. ఎలాగైనా తన మనువడికి కాపీలు అందజేయాలనే ఉద్దేశంతో అతను ఓ పెద్ద కర్ర తీసుకొచ్చాడు. దానికి చివర్లో పేపర్లను కట్టేసి, కిటికీ వద్ద ఎదురు చూస్తున్న తన మనువడికి (Grandfather giving copies to grandson) అందజేసేందుకు ప్రయత్నించాడు. ముందు కాస్త ఇబ్బంది పడినా.. తర్వాత ఎలాగోలా ప్రయత్నించి, వాటిని విద్యా్ర్థికి అందజేశాడు.
ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మనువడికి, తాతకు మధ్య అనుబంధం అంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘ఈ శ్రద్ధ ఏదో చదువుకునేలా సహకరించడంలో చూపిస్తే బాగుంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా లైక్‌లు, 1.94 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..