Share News

Viral Video: డాక్టర్ కాబోయి మెకానిక్ అయినట్టున్నాడు.. కారును ఎలా రిపేర్ చేస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Jan 29 , 2025 | 01:55 PM

ఓ వ్యక్తి కారును రిపేర్ చేస్తున్నాడు. ఇంజిన్ బానైట్‌ను పైకి ఎత్తి లోపల సీరియస్‌గా పరిశీలిస్తు్ంటాడు. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. సాధారణంగా అంతా స్పానర్స్‌తో చెక్ చేస్తే.. ఇతను మాత్రం వినూత్నంగా పరిశీలించాడు. ఇతడి నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Viral Video: డాక్టర్ కాబోయి మెకానిక్ అయినట్టున్నాడు.. కారును ఎలా రిపేర్ చేస్తున్నాడో చూడండి..

కొందరు చేసే పనులకు, ప్రవర్తించే తీరుకు సంబంధం లేకుండా వ్యవహరిస్తుంటారు. అందులోనూ ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది వైరల్ అయ్యేందుకు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తున్నాం. ఇంట్లోని వస్తువులతో విచిత్ర ప్రయోగాలు చేస్తూ కొందరు, బహిరంగ ప్రదేశాల్లో వినూత్న విన్యాసాలు చేస్తూ మరికొందరు నెటిజన్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కారును రిపేర్ చేస్తున్న వ్యక్తిని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘డాక్టర్ కాబోయి మెకానిక్ అయినట్టున్నాడు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కారును రిపేర్ చేస్తున్నాడు. ఇంజిన్ బానైట్‌ను పైకి ఎత్తి లోపల సీరియస్‌గా పరిశీలిస్తు్ంటాడు. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. సాధారణంగా అంతా స్పానర్స్‌తో చెక్ చేస్తే.. ఇతను మాత్రం మెడలో స్టెతస్కోప్‌ వేసుకుని పరిశీలిస్తున్నాడు.

Viral Video: ఇది కేన్సర్‌ గేమ్‌లా ఉందే.. వీళ్లెలా ఆడుతున్నారో చూస్తే అవాక్కవ్వాల్సిందే..


స్టెతస్కూప్‌ను చెవులకు తగిలించకున్న అతను.. దాని చివరన ఏర్పాటు చేసిన ఇనుప కడ్డీని (man examining car engine with stethoscope) ఇంజిన్‌లోని వివిధ భాగాల్లో టచ్ చేస్తున్నాడు. మనిషి గుండెచప్పుడును డాక్టర్ విన్నట్లుగానే ఇతను కూడా కారు ఇంజిన్ శబ్ధాలను స్టెతస్కోప్‌‌లో వింటున్నాడన్నమాట.

Viral Video: బాబా ఆశీర్వాదం కోసం కాళ్లు పట్టుకున్న యువకుడు.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..


కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతనేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘డాక్టర్ కాబోయి.. మెకానిక్ అయ్యాడేమో’’... అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7200కి పైగా లైక్‌లు, 5.70 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ప్రేయసి మాట్లాడుతుంటే ప్రపంచాన్నే మర్చిపోయాడు.. అంతలోనే దూసుకొచ్చిన రైలు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 29 , 2025 | 01:55 PM