Viral Video: బాబా ఆశీర్వాదం కోసం కాళ్లు పట్టుకున్న యువకుడు.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ABN , Publish Date - Jan 29 , 2025 | 12:19 PM
ఓ బాబా ఆలయం పక్కన కూర్చుని వచ్చి పోయే వారికి ఆశీర్వాదం అందిస్తున్నాడు. దీంతో అటుగా వెళ్లే వారంతా ఆ బాబా వద్ద ఆశీర్వాదం తీసుకుని, తమకు తోచిన విధంగా దక్షిణ కూడా సమర్పించుకుంటున్నారు. అయితే ఓ యువకుడు ఇలాగే ఆశీర్వాదం తీసుకుంటుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ‘మహాకుంభ్’కు సంబంధించిన అనేక వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో లక్షల సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్న విషయం తెలిసిందే. ఘాట్‌లలో భక్తుల రద్దీ, రైల్వే స్టేషన్లలో జనం తాకిడి తదితర సంఘటనలకు సంబందించిన వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి స్వామీజీ ఆశీర్వాదం తీసుకుంటున్న వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తోంది. బాబా ఆశీర్వాదం కోసం వచ్చిన యువకుడు.. కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించాడు. అయితే చివరకు బాబా రియాక్షన్‌తో ఖంగుతిన్నాడు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ బాబా ఆలయం పక్కన కూర్చుని వచ్చి పోయే వారికి ఆశీర్వాదం అందిస్తున్నాడు. ఆయన వెనుక గోడకు తగిలించి ఉన్న బ్యానర్‌పై ‘‘దివంబర్ దివాకర్ భారతి’’.., ‘‘మహాకుంభ్’’.. అని రాసి ఉంది. దీంతో అటుగా వెళ్లే వారంతా ఆ బాబా వద్ద ఆశీర్వాదం తీసుకుని, తమకు తోచిన విధంగా దక్షిణ కూడా సమర్పించుకుంటున్నారు.
Viral Video: ప్రేయసి మాట్లాడుతుంటే ప్రపంచాన్నే మర్చిపోయాడు.. అంతలోనే దూసుకొచ్చిన రైలు.. చివరకు..
ఇంతలో ఓ యువకుడు అటుగా వచ్చాడు. వచ్చీ రాగానే తన జేబులో నుంచి కొంత నగదు తీసి స్వామి ముందు ఉంచుతాడు. ఆ తర్వాత కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అతడి స్నేహితుడు ఈ ఘటనను మొత్తం వీడియో తీస్తుంటాడు. ఈ క్రమంలో ఆ యువకుడు స్వామి పాదాలు మొక్కుతూ కెమెరాకు ఫోజు ఇస్తాడు. అంతకు ముందే వీడియో తీయొద్దంటూ సదరు బాబా.. కెమెరామెన్ వైపు చేయి చూపిస్తుంటాడు. అదే సమయంలోనే ఆ యువకుడు కాళ్లు మొక్కుతూ కెమెరాకు ఫోజు ఇవ్వడం చూసి మరింత ఆగ్రహానికి గురవుతాడు.
Funny Viral Video: ఆనందంలో అత్యుత్సాహం అంటే ఇదే.. కొత్త స్కూటీకి పూజలు చేస్తుండగా..
వెంటనే అతడి తలపై గట్టిగా (Baba slapped young man's head) కొడతాడు. దెబ్బకు ఆ యువకుడు షాక్ అయి.. అక్కడి నుంచి దూరంగా పారిపోతాడన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘స్వామి ఆశీర్వాదాన్ని కూడా రీల్ చేయాలనుకున్నాడు’’.. అంటూ కొందరు, ‘‘బాబా బాగానే బుద్ధి చెప్పాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు, 5వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..