Viral Video: గొర్రెలను వెంబడిస్తూ లోయలోకి దూసుకెళ్లిన చిరుత.. చివరకు మేకలన్నీ కలిసి కొండపై నుంచి తొంగిచూడగా..
ABN , Publish Date - Jan 30 , 2025 | 07:17 AM
ఓ పెద్ద కొండపై మేత మేస్తున్న గొర్రెలు, మేకలు, పొట్టేళ్లను ఓ చిరుతపులి టార్గెట్ చేసింది. ఏటవాలుగా ఉన్న కొండపై ఒక్కాసారిగా వాటిపైకి ఎటాక్ చేసింది. చిరుత దూసుకురావడాన్ని గమనించిన పొట్టేళ్లు పరుగందుకున్నాయి. ఈ క్రమంలో చిరుత వాటిని వెంబడిస్తూ లోయలోకి దూసుకెళ్లింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

చిరుత పులుల వేట ఎంత వేగంగా, ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్షణాల వ్యవధిలో మెరుపు వేగం అందుకుని ఎలాంటి జంతువునైనా చిటికెలో వేటాడేస్తుంటాయి. అయితే ఇలాంటి చిరుతలకూ కొన్నిసార్లు షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. చిన్న చిన్న జంతువుల విషయంలోనూ తోక ముడవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. మరికొన్నిసార్లు ఏకంగా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి కూడా వస్తుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ చిరుతపులి కొండపై గొర్రెలను వెంబడిస్తూ లోయలోకి దూసుకెళ్లింది. చివరకు మేకలన్నీ కలిసి పైనుంచి తొంగిచూడగా షాకింగ్ సీన్ కనిపించింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద కొండపై మేత మేస్తున్న గొర్రెలు, మేకలు, పొట్టేళ్లను ఓ చిరుతపులి టార్గెట్ చేసింది. ఏటవాలుగా ఉన్న కొండపై ఒక్కాసారిగా (leopard chasing sheep) వాటిపైకి ఎటాక్ చేసింది. చిరుత దూసుకురావడాన్ని గమనించిన పొట్టేళ్లు పరుగందుకున్నాయి.
Viral Video: డాక్టర్ కాబోయి మెకానిక్ అయినట్టున్నాడు.. కారును ఎలా రిపేర్ చేస్తున్నాడో చూడండి..
చిరుత మెరుపువేగంతో వాటిని వేటాడేందుకు ప్రయత్నించినా.. పొట్టేళ్లు కూడా అంతే వేగంతో అటూ, ఇటూ పరుగెత్తుతూ చిరుతను తికమకపెట్టాయి. ఇంతలో మేకలు, గొర్రెలన్నీ కలిసి చిరుతను మరింత తికమకపెట్టాయి. చివరకు ఎలాగైనా వాటిని వేటాడాలనే ఉద్దేశంతో చిరుత వాటి పైకి దూకింది. ఈ క్రమంలో మేకలన్నీ అటూ, ఇటూ పరుగెత్తడంతో చిరుత నేరుగా కొండపై నుంచి (leopard fell into a valley) కింద లోయలోకి దూసుకెళ్లింది. కాసేపటికి మేకలన్నీ కలిసి మెల్లగా కొండ అంచుకు వెళ్లి కిందకు తొంగిచూశాయి. పైనుంచి లోయలోకి జారిపోయిన చిరుత కింద చలనం లేకుండా పడి ఉంది.
Viral Video: ఇది కేన్సర్ గేమ్‌లా ఉందే.. వీళ్లెలా ఆడుతున్నారో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఈ ఘటనలో చిరుత పులి ప్రాణాలు కోల్పోయినట్లు కనిపించింది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పొట్టేళ్లతో పెట్టుకుని ప్రాణాలు పోగొట్టుకున్న చిరుత’’. అంటూ కొందరు, ‘‘అన్నీ కలిసి ప్లాన్ చేసి మరీ చిరుతను హత్య చేశాయిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 లక్షలకు పైగా లైక్‌లు, 16.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..