Share News

Traffic Viral Video: ట్రాఫిక్ జామ్ అయినా నో ఫికర్.. ఎద్దుల బండి యజమానిని చూసి అంతా షాక్..

ABN , Publish Date - Jan 30 , 2025 | 10:25 AM

ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. పట్టణాలు, నగరాల్లో ట్రాఫిక్‌కు స్తంభించిన సమయంలో కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. ట్రాఫిక్ ఆగిపోవడంతో ఏకంగా తన బైకునే భుజాలపై మోసుకెళ్లిన వ్యక్తిని చూశాం. అలాగే..

Traffic Viral Video: ట్రాఫిక్ జామ్ అయినా నో ఫికర్.. ఎద్దుల బండి యజమానిని చూసి అంతా షాక్..

పట్టణాలు, నగరాల్లో ట్రాఫిక్ సమస్యలను నిత్యం చూస్తుంటాం. ఇక హైదరాబాద్, ముంబై వంటి మహా నగారాల్లో ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి సమయాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ట్రాఫిక్ జామ్ ఇరుక్కున్న ఎద్దుల బండి యజమానిని చూసి అంతా అవాక్కవుతున్నారు.


ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పట్టణాలు, నగరాల్లో ట్రాఫిక్‌కు స్తంభించిన సమయంలో కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. ట్రాఫిక్ ఆగిపోవడంతో ఏకంగా తన బైకునే భుజాలపై మోసుకెళ్లిన వ్యక్తిని చూశాం. అలాగే స్కూటీపై ఉన్న మహిళ.. ట్రాఫిక్ ఆగిపోయిన సమయంలో కూరగాయలు తరమడం కూడా చూశాం. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

Viral Video: మనువడిపై తాత ప్రేమ.. పరీక్ష కేంద్రం వద్ద ఎలా సాయం చేస్తున్నాడంటే..


తాజాగా, ఎద్దుల బండి వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ ఎద్దుల బండి యజమాని ట్రాఫిక్ మధ్యలో చిక్కకున్నాడు. ఇందులో విశేషం ఏముందీ.. అనేగా మీ సందేహం. అతను ట్రాఫిక్‌ మధ్యలో ఉన్నా ఎలాంటి చికాకు పడకుండా తాపీగా (man lying on bullock cart) బండిపై పడుకుని ఫోన్ చూసుకుంటున్నాడు. వాహనాలు ముందుకు కదిలినప్పుడల్లా ఎద్దు కూడా ముందుకు జరుగుతూ ఉండడంతో యజమానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఎంచకా ఫోన్ చూసుకుంటూ పడుకుండిపోయాడన్నమాట.

Maha Kumbh Mela: కుంభమేళాలో అరుదైన ఘటన.. 27 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి.. అకస్మాత్తుగా అఘోరిగా..


ఎద్దుల బండిపై తాపీగా పడుకున్న ఈ వ్యక్తిని చూసిన మిగతా వాహనదారులు అవాక్కయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నో చార్జింగ్.. నో పొల్యూషన్’’.. అంటూ కొందరు, ‘‘ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ టేకింగ్, డ్రంకెన్ డ్రైవింగ్ గోలే ఉండదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16వేలకు పైగా లైక్‌లు, 3.10 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: గొర్రెలను వెంబడిస్తూ లోయలోకి దూసుకెళ్లిన చిరుత.. చివరకు మేకలన్నీ కలిసి కొండపై నుంచి తొంగిచూడగా..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 30 , 2025 | 10:25 AM