Share News

Train Viral Video: సీటు కోసం ఫీట్లు.. ఏకంగా స్పైడర్ మ్యాన్‌గా మారిపోయాడుగా..

ABN , Publish Date - Jan 30 , 2025 | 01:20 PM

ఓ వ్యక్తి అందరితో పాటే రైలెక్కాడు. అయితే బోగీలో పరిస్థితి దారుణంగా కనిపించింది. సీటు కాదు కదా.. అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. అయినా అతను ఎలాగైనా సీటు సంపాదించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో చివరకు స్పైడర్ మ్యాన్ తరహాలో అతను చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Train Viral Video: సీటు కోసం ఫీట్లు.. ఏకంగా స్పైడర్ మ్యాన్‌గా మారిపోయాడుగా..

రైలు ప్రయాణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీటు దొరికితే ఎంత హాయిగా ఉంటుందో.. దొరక్కపోతే అంతకంటే ఎక్కువగా నరకం కనిపిస్తుంటుంది. కొన్నిసార్లు సీటు కోసం ఏకంగా పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంటుంది. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదాల బారిన పడిన సందర్భాలను కూడా చూశాం. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘సీటు కోసం స్పైడర్ మ్యాన్‌గా మారిపోయాడుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి అందరితో (Train) పాటే రైలెక్కాడు. అయితే బోగీలో పరిస్థితి దారుణంగా కనిపించింది. సీటు కాదు కదా.. అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. అయినా అతను ఎలాగైనా సీటు సంపాదించుకోవడానికి ప్రయత్నించాడు.

Viral Video: మాట వినకపోతే మటాషే.. భర్తను ఎలా వణికించిందో చూస్తే.. అదిరిపడతారు..


ఇందుకోసం చివరకు సీట్లపైకి చేరుకుని, అటు నుంచి అటే కాలు ఒకదానిపై ఒకటిగా వరుసగా కలు పెట్టుకుంటూ ముందుకు సాగిపోయాడు. చూస్తుండగానే చాలా దూరం వరకూ అలాగే అటూ, ఇటూ కాలు పెట్టుకుంటూ ఎంతో చాకచక్యంగా దాటుకుంటూ వెళ్లాడు. చివరకు అటు పక్కగా ఉన్న సీట్లో కూర్చుని.. ‘‘హమ్మయ్య.. సీటు దొరికేసింది’’.. అని అనుకుంటూ కూర్చుండిపోయాడు.

Watch Video: టేబుల్‌పై రూ.70 కోట్లు.. ఉద్యోగులకు బంపరాఫర్.. అయితే చివర్లో...


ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సీటు కోసం స్పైడర్ మ్యాన్ అయిపోయాడుగా’’.. అంటూ కొందరు, ‘‘మధ్యలో యువతి ఎక్స్‌ప్రెషన్ సూపర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8.4 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Traffic Viral Video: ట్రాఫిక్ జామ్ అయినా నో ఫికర్.. ఎద్దుల బండి యజమానిని చూసి అంతా షాక్..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 30 , 2025 | 01:20 PM