Viral Video: మాట వినకపోతే మటాషే.. భర్తను ఎలా వణికించిందో చూస్తే.. అదిరిపడతారు..
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:53 PM
ఓ వ్యక్తి తన భార్యతో ఏదో విషయమై గొడవపడ్డాడు. భార్య కూడా భర్తను లెక్కచేయకుండా పోటాపోటీగా వాగ్వాదానికి దిగింది. అయితే పదే పదే భర్త ఎక్కువగా మాట్లాడుతుండడంతో భార్యకు కోపం కట్టలు తెంచుకుంది. చివరకు ఆమె చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

భార్యాభర్తల మధ్య నిత్యం వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. అవి కొన్నిసార్లు మాటల వరకే ఆగిపోతుంటే.. మరికొన్నిసార్లు గొడవల వరకూ వెళ్తుంటాయి. ఇంకొన్నిసార్లు ఏకంగా కొట్టుకునే వరకూ వెళ్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసిన భార్య చివరకు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘మాట వినకపోతే మటాషే..’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన భార్యతో ఏదో విషయమై గొడవపడ్డాడు. భార్య కూడా భర్తను లెక్కచేయకుండా పోటాపోటీగా వాగ్వాదానికి దిగింది. అయితే పదే పదే భర్త ఎక్కువగా మాట్లాడుతుండడంతో భార్యకు కోపం కట్టలు తెంచుకుంది.
Watch Video: టేబుల్‌పై రూ.70 కోట్లు.. ఉద్యోగులకు బంపరాఫర్.. అయితే చివర్లో...
తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య.. ‘‘ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా.. నీకు మాటలతో చెబితే అర్థం కాదు’’.. అని అనుకుంటు అక్కడే ఉన్న చెట్టు కొమ్మను పట్టుకుని, భర్త గుండెలపై (Wife kicked her husband) ఒక్క తన్ను తన్నింది. దెబ్బకు అతను ఎగిరి దూరంగా పడిపోయాడు. తన్నిన తర్వాత కూడా భర్తను బూతులు తిడుతూ తన కోపాన్ని చల్లార్చుకుంటుంది. కిందపడ్డ చేసేదేమీలేక మిన్నకుండిపోతాడు.
Traffic Viral Video: ట్రాఫిక్ జామ్ అయినా నో ఫికర్.. ఎద్దుల బండి యజమానిని చూసి అంతా షాక్..
ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘భార్యను తక్కువగా అంచనా వేస్తే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ కొందరు, ‘‘భార్యతో వాదించడం కంటే సైలెంట్‌గా ఉండడం బెటర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: మనువడిపై తాత ప్రేమ.. పరీక్ష కేంద్రం వద్ద ఎలా సాయం చేస్తున్నాడంటే..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..