RTC bus: నిద్రపోతున్న డ్రైవర్.. బస్సుపై కన్నేసిన దొంగ.. చివరకు..
ABN , Publish Date - Jul 24 , 2025 | 09:59 AM
ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే టార్గెట్ చేశారు. డ్రైవర్ నిద్రపోతుండడాన్ని గమనించిన దొంగ చివరకు బస్సునే చోరీ చేశాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దొంగలు ఎంతకైనా తెగిస్తున్నారు. కళ్ల ముందే నిలబడి జేబులోని పర్సులు, ఫోన్లు కొట్టేవారు కొందరైతే.. మరికొందరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇల్లు మొత్తం గుళ్ల చేసేస్తున్నారు. తాజాగా, ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే టార్గెట్ చేశారు. డ్రైవర్ నిద్రపోతుండడాన్ని గమనించిన దొంగ చివరకు బస్సునే చోరీ చేశాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో (Nellore District) ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మకూరు డిపోకు చెందిన బస్సు (RTC bus) .. బుధవారం రాత్రి ఏఎస్ పేట నుంచి నెల్లూరు బస్టాండ్‌కు వచ్చింది. బస్సును పార్క్ చేసిన డ్రైవర్.. రెస్ట్ రూంలో నిద్రపోయాడు. అయితే ఉదయం లేచి చూస్తే ఆ బస్సు కనిపించలేదు.
బస్సు కనిపించకపోవడంతో షాకైన డ్రైవర్ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బస్టాండ్‌లోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. బస్సును దొంగ చోరీ చేయడాన్ని (Thief steals RTC bus) గుర్తించిన పోలీసులు.. చివరకు ఆ బస్సు బుచ్చిరెడ్డిపాలెం టోల్‌గేట్ వద్ద ఉన్నట్లు తెలుసుకున్నారు.
ఎట్టకేలకు దొంగను అదుపులోకి తీసుకుని, బస్సును స్వాధీనం చేసుకున్నారు. బస్సును చోరీ చేసిన దొంగ.. విడవలూరు మండలం కంచర్ల గ్రామానికి చెందిన బిట్రగుంట కృష్ణగా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఈమె తెలివి అమోఘం.. తాళం పాడవకుండా ఏం చేసిందంటే..
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెనుక వేలాడుతున్న పాము.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి