Viral Video: ఇతనంటే కందిరీగలకు హడల్.. చేయి పెట్టగానే ఏమైందో చూడండి..
ABN , Publish Date - Jul 13 , 2025 | 11:14 AM
ఓ వ్యక్తి పైపులో ఉన్న కందిరీగల తుట్టెను చూసి, అందులోకి చేయి పెట్టాడు. తుట్టె వద్దకు చేయిని మెల్లగా తీసుకెళ్లి.. చివరకు తుట్టెను పట్టుకుంటాడు. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

కొందరు చేసే పనులు చూస్తే అనితర సాధ్యం అనిపిస్తుంటుంది. కొందరు వాహనాలతో విచిత్ర విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు ఇళ్లల్లోని వస్తువులతో వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి చేసిన విచిత్రమైన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. కందిరీగల తెట్టెను పట్టుకోవడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పైపులో ఉన్న కందిరీగల తుట్టెను చూసి, అందులోకి చేయి పెట్టాడు. తుట్టె వద్దకు చేయిని మెల్లగా తీసుకెళ్లి.. చివరకు తుట్టెను పట్టుకుంటాడు. అయితే మామూలుగా అయితే సమీపానికి రాగానే కందిరీగలు దాడి చేస్తాయి.
కానీ ఇతను వాటి పక్కనే చేయి పెట్టి, (Man Touched the Hornets comb ) తుట్టెను పీకి బయటికి తీసుకొచ్చినా కూడా కందిరీగలు కిక్కురుమనలేదు. కనీసం ఒక్కటి కూడా అతడిని కుట్టే ప్రయత్నం చేయలేదు. ఇలా కందిరీగల తుట్టెను పీకి అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. అది చేయా లేక ఇనుప రాడ్డా’.. అంటూ కొందరు, ‘ఇతడికేమైనా మంత్రశక్తులు ఉన్నాయా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 800కి పైగా లైక్‌లు, 1.54 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
కోబ్రా విషం ఎంత డేంజరో తెలుసా.. కాటేయగానే ఏం జరిగిందో చూడండి..
రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి