Student Exam Video: వామ్మో.. వీడు మామూలోడు కాదు.. ఎంత తెలివిగా కాపీ కొడుతున్నాడో చూస్తే..
ABN , Publish Date - Jul 11 , 2025 | 08:10 PM
ఓ విద్యార్థి పరీక్ష కేంద్రంలో తోటి విద్యార్థులతో కలిసి పరీక్ష రాస్తున్నాడు. ఇందులో విశేషమేముందీ.. అని అనుకుంటున్నారా. అందరిలా పరీక్ష రాసి ఉండుంటే ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరమే ఉండదు. అతను అందరిలా కాకుండా..

కొందరు విద్యార్థులు ఎంతో తెలివిగా వ్యవహరిస్తుంటారు. మరికొందరు విద్యార్థులు టెక్నాలజీని వాడుకుని టీచర్లకు షాక్ ఇస్తుంటారు. ఇంకొందరు విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లో అతి తెలివితో కాపీ కొడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. కాపీలు కొట్టే విధానం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. కొందరు స్లిప్పులు దాచుకుని చూసి రాస్తుంటే.. మరికొందరు మరింత అప్‌గ్రేడ్ అవుతూ బ్లూటూత్ ద్వారా సమాచారం సేకరించి మరీ కాపీలు కొడుతుంటారు. ఇలాంటి వింత ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ విద్యార్థి కాపీ కొట్టిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘దొంగలనే మించిపోయాడుగా’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ విద్యార్థి పరీక్ష కేంద్రంలో తోటి విద్యార్థులతో కలిసి పరీక్ష రాస్తున్నాడు. ఇందులో విశేషమేముందీ.. అని అనుకుంటున్నారా. అందరిలా పరీక్ష రాసి ఉండుంటే ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరమే ఉండదు. అతను అందరిలా కాకుండా వినూత్నంగా కాపీ కొట్టి అంతా అవాక్కయ్యేలా చేశాడు.
స్లిప్పులు, బ్లూటూత్ గోల అంతా ఎందుకనుకున్నాడో ఏమో గానీ.. ఏకంగా స్మార్ట్ ఫోన్‌నే తీసుకొచ్చాడు. అయితే జేబులో పెట్టుకురావడం సాధ్యం కాదు కాబట్టి.. (Student hides phone in wall) పరీక్ష కేంద్రంలోనే దాచేశాడు. కిటికీ ఊచలు పీకేసే దొంగల తరహాలో ఇతను కూడా గోడపై ఏసీ కోసం ఏర్పాటు చేసిన చిన్న గ్రిల్‌ను ఊడదీశాడు. దాని వెనుక స్మార్ట్ ఫోన్‌ను దాచి యథాతథంగా మూసేశాడు. తీరా పరీక్ష రాసే సమయంలో ఆ గ్రిల్ తొలగించి, తన ఫోన్ తీసుకుని ఎంచక్కా పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యాడు.
ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ విద్యార్థి తెలివితేటలు మామూలుగా లేవుగా’.. అంటూ కొందరు, ‘ఇలా కాపీ కొట్టడం ఇప్పుడే చూస్తున్నాం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వందకు పైగా లైక్‌లు, 13 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
కోబ్రా విషం ఎంత డేంజరో తెలుసా.. కాటేయగానే ఏం జరిగిందో చూడండి..
రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి