Lamborghini Viral Video: పాత విడిభాగాలతో లాంబోర్గినీ.. ఇతడి టాలెంట్ చూస్తే శభాష్ అనాల్సిందే..
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:47 PM
లాంబోర్గినీ కారును ఇష్టపడని వాహనదారులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ కారు కొనాలని అందరికీ ఉంటుంది. కానీ అంత డబ్బులు వెచ్చించలేక.. ఆ కోరికను చంపుకొంటుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన కలల కారును కొనే స్థోమత లేకున్నా కూడా తానే తన ఇంట్లో తయారు చేసుకున్నాడు. అది కూడా..

చాలా మంది పాత వస్తువులతో సరికొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో వాటితో ఏకంగా అద్భుతాలే సృష్టిస్తుంటారు. కొందరు సైకిల్ విడిభాగాలు, మోటారు సాయంతో గుర్రపు బండి తయారు చేస్తే.. మరికొందరు ఆటోను కారుగా మారుస్తుంటారు. ఇంకొందరైతే కారుకు హెలీకాప్టర్ తరహాలో రెక్కలు పెట్టి అందరినీ ఆకట్టుకుంటుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ వ్యక్తి పాత వాహనాల విడి భాగాలతో ఏకంగా లాంబోర్గినీ కారునే తయారు చేశాడు. ఇతడి ప్రయోగం చూసి అంతా శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. లాంబోర్గినీ కారును (Lamborghini car) ఇష్టపడని వాహనదారులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ కారు కొనాలని అందరికీ ఉంటుంది. కానీ అంత డబ్బులు వెచ్చించలేక.. ఆ కోరికను చంపుకొంటుంటారు. అయితే కేరళకు (Kerala) చెందిన బిబిన్ అనే ఓ వ్యక్తి మాత్రం తన కలల కారును కొనే స్థోమత లేకున్నా కూడా తానే తన ఇంట్లో తయారు చేసుకున్నాడు. అది కూడా పాత విడి భాగాలను ఉపయోగించి.. అచ్చం లాంబోర్గినీలా కనిపించే కారును రూపొందించాడు.
ఈ కారును తయారు చేయడం కోసం మారుతి సుజుకి ఆల్టో వాహనానికి (Lamborghini made from old Maruti Suzuki vehicle parts) సంబంధించిన చక్రాలు, ఇంజిన్ వాడినట్లు బిబిన్ తెలిపాడు. అలాగే మిగతా విడి భాగాలను కూడా సేకరించి, ఫైనల్‌గా ఆ వాహనాన్ని లాంబోర్గినీ షేప్‌లోకి తీసుకొచ్చాడు. ఎక్కడా అనుమానం రాకుండా లాంబోర్గినీ తరహాలోనే స్టీరింగ్, డోర్లు.. ఇలా అన్నింటినీ మక్కీకి మక్కీ దించేశాడు.
రెక్కల్లా తెరుచుకునే డోర్లు.. అచ్చం లాంబోర్గినీ మాదిరిగానే ఉండడంతో చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ కారును తయారు చేయడం కోసం మూడేళ్లుగా కష్టపడుతున్నట్లు బిబిన్ తెలిపాడు. ఉదయం తన విధులను పూర్తి చేసుకుని, రాత్రి వేళల్లో కారు తయారీ పనులు చేసినట్లు చెప్పాడు. ఈ కారు తయారీ కోసం ఇప్పటిదాకా రూ.1.5 లక్షలు వెచ్చించినట్లు తెలిపాడు. ఇంకా కారు ఇంటీరియర్ పనులు చేయాల్సి ఉందన్నాడు. మొత్తం మీద తక్కువ ఖర్చుతో ఇతను తయారు చేసిన లాంబోర్గినీ కారు అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘స్ర్కాప్‌ను కూడా ఖరీదుగా మార్చడం అంటే ఇదే’.. అంటూ కొందరు, ‘ఇది అనితర సాధ్యం.. చాలా కష్టపడ్డారు బ్రదర్’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3,700 మందికి పైగా లైక్‌లు, 1.1 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..
నిర్లక్ష్యం ఇలాక్కూడా ఉంటుందా.. ఈ ఫ్రిడ్జ్ లోపల ఏముందో చూస్తే నోరెళ్లబెడతారు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి