Share News

Lovers Viral Video: వినూత్నంగా ప్రపోజ్ చేయాలనుకున్నాడు.. చివరకు ఖంగుతిన్నాడు..

ABN , Publish Date - Jul 06 , 2025 | 01:37 PM

ఓ వ్యక్తి తన ప్రియురాలికి వినూత్నంగా ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఆమెను ఓ పెద్ద జలపాతం వద్దకు తీసుకెళ్లాడు. జలపాతం మధ్యలో నిలబడ్డ అతను.. మోకాళ్లపై నిల్చుని ఉంగరం తొడిగి లవ్ ప్రపోజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..

Lovers Viral Video: వినూత్నంగా ప్రపోజ్ చేయాలనుకున్నాడు.. చివరకు ఖంగుతిన్నాడు..

ప్రేమికులు ఎక్కడ ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలీదు. చుట్టూ ఎవరున్నారనే కనీస స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. కొందరు బైకుల్లో వెళ్తూ ముద్దులు పెట్టుకుంటుంటే.. మరికొందరు పార్కుల్లో పాడు పనులు చేస్తూ అందరికీ ఆగ్రహం తెప్పిస్తుంటారు. ఇంకొందరైతే తాము ప్రేమించిన వారికి వినూత్నంగా ప్రపోజ్ చేయాలని చూసి చివరకు ప్రమాదాల్లో పడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన ప్రియురాలికి వినూత్నంగా ప్రపోజ్ చేయాలని చూశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ప్రియురాలికి వినూత్నంగా ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఆమెను ఓ పెద్ద జలపాతం వద్దకు తీసుకెళ్లాడు. జలపాతం (waterfall) మధ్యలో నిలబడ్డ అతను.. మోకాళ్లపై నిల్చుని ఉంగరం తొడిగి లవ్ ప్రపోజ్ (Love proposal) చేసేందుకు సిద్ధమయ్యాడు.


అయితే తీరా మోకాళ్లపై నిలబడే క్రమంలో కాలు జారి పైనుంచి ధబేల్‌మని కిందకు పడిపోయాడు. అయితే నేరుగా వచ్చి కింద నీళ్లలో పడిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. తన ప్రియుడు తన కళ్ల ముందే పైనుంచి పడిపోవడం చూసి ఆమె షాక్ అయింది. ఈ ఘటనలో అతను నీళ్లలో పడిపోవడంతోనే ఈ వీడియో ముగుస్తుంది. చూస్తుంటే ఆ వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఏదో చేయాలని చూస్తే.. చివరకు ఇంకేదో అయిందే’.. అంటూ కొందరు, ‘ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తే.. ఇలాగే జరుగుతుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..

నిర్లక్ష్యం ఇలాక్కూడా ఉంటుందా.. ఈ ఫ్రిడ్జ్‌ లోపల ఏముందో చూస్తే నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 06 , 2025 | 01:37 PM