Boy Funny Video: నేనే ప్రధాని అయితే.. ఈ బుడ్డోడి మాటలు వింటే పడి పడి నవ్వాల్సిందే..
ABN , Publish Date - Jul 06 , 2025 | 11:35 AM
ఎంత ఫ్రస్టేట్ అయ్యాడో ఏమో గానీ.. ఓ బుడ్డోడి మాటలు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తున్నాయి. అప్పటికే ఏడుస్తున్న ఆ బుడ్డోడు.. చేతిలో ఫోన్ పట్టుకుని కోపంగా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఇక భరించడం నా వల్ల కాదు.. అన్నట్లుగా మాట్లాడుతూ.. ఆ పిల్లాడు అన్న మాటలు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తున్నాయి..

పిల్లల ప్రవర్తన చిత్రవిచిత్రంగా ఉంటుంది. కొన్నిసార్లు వాని ఆశ్చర్యం కలుగుతుంది. మరికొన్నిసార్లు వారి ప్రవర్తన చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి పిల్లలకు సంబంధించిన అనేక వీడియోలను సోషల్ మీడియాలో చూస్తుంటాం. తాజాగా, ఓ పిల్లాడి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. తానే గనుక ప్రధాని అయితే.. ఏం చేస్తాడో చెప్పాడు. ఏడుస్తూ కోపంగా చెప్పిన ఆ బుడ్డోడి మాటలు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఎంత ఫ్రస్టేట్ అయ్యాడో (Frustrated boy) ఏమో గానీ.. ఓ బుడ్డోడి మాటలు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తు్న్నాయి. అప్పటికే ఏడుస్తున్న ఆ బుడ్డోడు.. చేతిలో ఫోన్ పట్టుకుని కోపంగా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఇక భరించడం నా వల్ల కాదు.. అన్నట్లుగా మాట్లాడుతూ.. ‘నేనే గనుక ప్రధాన మంత్రి అయితే.. మొట్టమొదట ఈ పరీక్షలన్నింటీ రద్దు చేసేస్తా’.. అంటూ ఏడుస్తూనే ఆవేశంగా అన్నాడు.
ఆ మాటలు అన్నప్పుడు అతడి మనసులో బాధ, ఆక్రోశం, పరీక్షలపై తనకున్న కోపంతో పాటూ అమాయకత్వం.. ఇలా అన్నీ కనిపించాయి. దీంతో ఈ బుడ్డోడి మాటలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇతడి మాటలు విన్న వారంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
‘భగత్ సింగ్ మళ్లీ పుట్టాడు’.., ‘ఇతన్ని పార్లమెంట్‌కు పంపాల్సిందే’.., ‘మేమంతే నీకే ఓటేస్తాం’.., ‘నీ గొంతులో బాధ స్పష్టంగా తెలుస్తోంది’.., ‘నీకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది’.., ‘నా మొట్ట మొదటి ఓటు నీకే’.., ‘నువ్వు తగ్గనే తగ్గొద్దు.. ఇలాగే ముందుకు వెళ్లు’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..
నిర్లక్ష్యం ఇలాక్కూడా ఉంటుందా.. ఈ ఫ్రిడ్జ్ లోపల ఏముందో చూస్తే నోరెళ్లబెడతారు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి