Woman With Chimpanzee: చేసేదే పాడుపని.. మళ్లీ చింపాంజీనీ చెడగొట్టిందిగా.. యువతిపై నెటిజన్ల ఫైర్..
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:33 PM
వ్యూస్ కోసం కొందరు ఎంతటి సాహసాలు చేయడానికైనా వెనుకాడడం లేదు. ఇలాంటి వింత వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘చేసేదే పాడు పని.. మళ్లీ చింపాంజీని కూడా చెడగొట్టిందిగా’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువత లైఫ్ మీద కాకుండా లైక్‌ల మీద దృష్టి పెడుతున్నారు. ఎన్ని ఎక్కువ వ్యూస్‌లు, లైక్‌లు వస్తే.. అంత గొప్పగా ఫీలవుతున్నారు. ఒకవేళ లైకులు రాకపోతే డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం, కొందరైతే ఆత్మహత్య చేసుకోవడం వంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరికొందరైతే.. వ్యూస్ కోసం ఎంతటి సాహసాలు చేయడానికైనా వెనుకాడడం లేదు. ఇలాంటి వింత వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘చేసేదే పాడు పని.. మళ్లీ చింపాంజీని కూడా చెడగొట్టిందిగా’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి జూలోని చింపాంజీ ఎన్‌క్లోజర్ (Chimpanzee enclosure) వద్దకు వెళ్తుంది. చింపాంజీని చూసి వెళ్లిపోవాల్సిన యువతి.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. ఎలక్ట్రానిక్ సిగరెట్‌ను వెంట తెచ్చుకున్న ఆమె.. దాన్ని తన నోటిలో పెట్టుకుని పొగ పీల్చుతుంది. అంతటితో ఆగకుండా చివరకు ఏకంగా చింపాంజీ నోట్లో పెడుతుంది.
యువతి ఈ-సిగరెట్ పెట్టడంతో (young woman put e-cigarette in chimpanzee mouth) చింపాజీ కూడా దాన్ని మనుషుల తరహాలో గట్టిగా పీల్చి, పొగను బయటికి వదిలేసింది. ఇలా ఆమె చాలా సార్లు ఈ-సిగరెట్‌ను చింపాంజీ నోట్లో పెడుతూనే ఉంది. చింపాంజీ కూడా ఏమాత్రం తగ్గకుండా దాన్ని పీల్చుతూ గుప్పు గుప్పుమంటూ పొగను బయటికి వదిలేసింది. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి.. ఆ తప్పు తాను చేయడమే కాకుండా.. మళ్లీ చింపాజీని కూడా చెడగొట్టడంపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’.. అంటూ కొందరు, ‘జంతువులతో ఇలాంటి పనులు చేయించడం నేరం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 18 వేలకు పైగా లైక్‌లు, 7.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..
నిర్లక్ష్యం ఇలాక్కూడా ఉంటుందా.. ఈ ఫ్రిడ్జ్ లోపల ఏముందో చూస్తే నోరెళ్లబెడతారు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి