Watch Video: థింక్ స్మార్ట్ అంటే ఇదే.. ఇతనెలా పని చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:12 PM
ఓ వ్యక్తి భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. పని చేయడంలో వింతేమీ లేదు గానీ.. అతను పని చేస్తున్న తీరే.. అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. బయటి నుంచి ఇంట్లోకి ఇసుకను మోసుకొస్తున్న అతను..

కొందరు చేసే పనులనే ఎంతో కష్టంగా చేస్తుంటారు. మరికొందరు అదే పనులను ఎంతో తెలివిగా చేస్తుంటారు. అయితే ఇంకొందరు మాత్రం కష్టమైన పనులను కూడా తెలివితో పాటు స్మార్ట్‌గా చేస్తుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి స్మార్ట్‌గా పని చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. థింక్ స్మార్ట్ అంటే ఇదే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. పని చేయడంలో వింతేమీ లేదు గానీ.. అతను పని చేస్తున్న తీరే.. అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. బయటి నుంచి ఇంట్లోకి ఇసుకను మోసుకొస్తున్న అతను.. తన తెలివిని ప్రదర్శించాడు.
ఓ ప్లాస్టిక్ బుట్టలో ఇసుకను మోసుకెళ్తున్నాడు. అయితే ఆ బుట్ట మధ్యలో చీలిపోయింది. అయితే అదే బుట్టలో ఇసుక వేసి, (Man carrying sand in broken plastic basket) చీలిపోయిన వైపునకు వ్యతిరేక దిశలో పట్టుకున్నాడు. దీంతో అందులోని ఇసుక కిందపడకుండా అలాగే ఉంది. ఇంట్లోకి వెళ్లిన తర్వాత కిందపెట్టి, మరోవైపు పట్టుకుని పైకి ఎత్తడంతో అందులోని ఇసుక మొత్తం మధ్యలో నుంచి కిందపడిపోయింది. ఇలా.. చేసే పనిలో కూడా తెలివిగా వ్యవహరించిన ఇతడిని చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇతడి తెలివి మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..
నిర్లక్ష్యం ఇలాక్కూడా ఉంటుందా.. ఈ ఫ్రిడ్జ్ లోపల ఏముందో చూస్తే నోరెళ్లబెడతారు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి