Suicide Viral Video: ఇలాంటి పని ఎవరూ చేయొద్దు.. భార్యతో గొడవపడి ఇతనేం చేశాడో చూస్తే..
ABN , Publish Date - Jul 10 , 2025 | 04:42 PM
ఓ అపార్ట్‌మెంట్‌లో నాలుగో అంతస్తులో ఓ జంట నివాసం ఉంటోంది. అయితే వీరి మధ్య గతంలో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఇటీవల గొడవ జరిగింది. ఈ గొడవ కాస్తా కాసేపటికి పెద్దగా మారింది. అయితే ఈ క్రమంలో బాగా విసిగిపోయిన భర్త.. ఇంటి లోపలి నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి..

భార్యాభర్తలు అన్నాక సవాలక్ష గొడవలుంటాయి. అయితే పాల మీద పొంగులా అవి వెంటనే సర్దుమణుగుతుంటాయి. కొన్నిసార్లు మాత్రం చాలా దూరం వెళ్తుంటాయి. దంపతుల్లో ఎవరో ఒకరు గొడవలను చాలా సీరియస్‌గా తీసుకుంటుంటారు. ఈ క్రమంలో ఎదుటి వారిపై దాడి చేయడమో, లేక తాము ఆత్మహత్య చేసుకోవడమో చేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ భర్త చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘అయ్యో ఎంత పని చేశావ్ బ్రదర్’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బెంగళూరులో (Bangalore) జరిగినట్లు తెలుస్తోంది. ఓ అపార్ట్‌మెంట్‌లో నాలుగో అంతస్తులో ఓ జంట నివాసం ఉంటోంది. వీరి మధ్య గతంలో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఇటీవల ఓ రోజు గొడవ జరిగింది. ఈ గొడవ కాస్తా కాసేపటికి పెద్దదైంది. అయితే ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన భర్త.. ఇంటి లోపలి నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి, (Husband jumping from fourth floor) నాలుగో అంతస్తు నుంచి అమాంతం దూకేశాడు.
భర్త పరుగెత్తుతూ వెళ్లడం చూసి భార్య కూడా వెనుకే వేగంగా వచ్చింది. అయితే అప్పటికే అతను కిందకు దూకేయడంతో కాపాడే అవకాశం లేకుండా పోయింది. కిందపడ్డ అతను.. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతను కిందపడిపోగానే చుట్టూ ఉన్న వారు పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అయ్యో ఎంత పని చేశావ్ బ్రదర్’.. అంటూ కొందరు, ‘భార్యభర్తలు అన్నాక గొడవలు కామన్.. సర్దుకుపోవాలి గానీ.. ఇలాంటి పనులు చేయకూడదు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1300కి పైగా లైక్‌లు, 1.22 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..
నిర్లక్ష్యం ఇలాక్కూడా ఉంటుందా.. ఈ ఫ్రిడ్జ్ లోపల ఏముందో చూస్తే నోరెళ్లబెడతారు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి