Share News

Cobra Viral Video: కోబ్రా విషం ఎంత డేంజరో తెలుసా.. కాటేయగానే ఏం జరిగిందో చూడండి..

ABN , Publish Date - Jul 10 , 2025 | 09:56 PM

జనావాసాల్లోకి కోబ్రా చొరబడిందనే సమాచారంతో ఓ స్నేక్ క్యాచర్ సంఘటన స్థలానికి చేరుకున్నాడు. పామును పట్టుకునే సమయంలో అతను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రత్యేకంగా తయారు చేసిన స్టిక్‌తో పామును పట్టుకుని, దాన్ని ఓ ప్లాస్టిక్ డబ్బాలో వేసేందుకు ప్రయత్నించాడు. అయితే..

Cobra Viral Video: కోబ్రా విషం ఎంత డేంజరో తెలుసా.. కాటేయగానే ఏం జరిగిందో చూడండి..

పాములు డేంజర్ అనే విషయం తెలిసిందే. అందులోనూ కోబ్రా వంటి పాములు మరింత ప్రమాదకరమనే విషయం కూడా తెలుసు. ఈ పాములు ఒక్కసారి కాటేస్తే ఇక బతికే అవకాశం దాదాపు లేనట్లే. వెంటనే చికిత్స అందితే తప్ప ప్రాణాలు నిలిచే అవకాశమే ఉండదు. చాలా మంది ఇలాంటి ప్రమాదకర పాములను పట్టే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. ఇలాంటి షాకింగ్ సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పట్టుకునే సమయంలో స్నేక్ క్యాచర్‌ను కోబ్రా కాటేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. జనావాసాల్లోకి కోబ్రా చొరబడిందనే సమాచారంతో ఓ స్నేక్ క్యాచర్ సంఘటన స్థలానికి చేరుకున్నాడు. పామును పట్టుకునే సమయంలో అతను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రత్యేకంగా తయారు చేసిన స్టిక్‌తో పామును పట్టుకుని, దాన్ని ఓ ప్లాస్టిక్ డబ్బాలో వేసేందుకు ప్రయత్నించాడు. అయితే (Cobra bites snake catcher) ఈ క్రమంలో అప్రమత్తంగా లేకపోవడంతో కోబ్రా అతన్ని కాటేసింది.


అయినా ఆ వ్యక్తి లెక్కచేయకుండా.. ఆ పామును ప్లాస్టిక్ బాటిల్‌లో బంధించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడి పరిస్థితి క్షణాల్లో విషమించింది. అంతా చూస్తుండగానే అతను ప్లాస్టిక్ డబ్బాను వదిలేసి, ధమేల్‌మని కిందపడిపోయాడు. స్నేక్ క్యాచర్ అలా పడిపోగానే అంతా అతడి చుట్టూ చేరి.. పైకి లేపే ప్రయత్నం చేశారు. అయితే అతను మాత్రం ఉలుకూపలుకూ లేకుండా అలాగే పడి ఉన్నాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ వీడియోల్లో చెప్పిన ప్రకారం.. ఈ ఘటనలో అతను మృతి చెందినట్లు తెలుస్తోంది.


కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అంతా చూస్తున్నారే గానీ.. రక్షించే ప్రయత్నం ఎవరూ చేయలేదు’.. అంటూ కొందరు, ‘ఇలాంటి సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 21 వేల మందికి పైగా వీక్షించారు.


ఇవి కూడా చదవండి..

రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..

నిర్లక్ష్యం ఇలాక్కూడా ఉంటుందా.. ఈ ఫ్రిడ్జ్‌ లోపల ఏముందో చూస్తే నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 09:59 PM