Elephant Viral Video: ఈ ఏనుగు మరీ రొమాంటిక్ గురూ.. యువతి సెల్ఫీ తీసుకుంటుండగా..
ABN , Publish Date - Jul 12 , 2025 | 09:32 PM
పర్యాటకులంతా ఏనుగు వద్దకు వెళ్లి ఫొటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో ఓ యువతి కూడా దాని సమీపానికి వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఈ క్రమంలో ఏనుగు ప్రవర్తన చూసి అంతా అవాక్కవుతున్నారు..

ఏనుగులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా.. మరికొన్నిసార్లు అంతా షాక్ అయ్యేలా.. ఇంకొన్నిసార్లు తెగ నవ్వుకునేలా ప్రవర్తిస్తుంటాయి. సెల్ఫీలు తీసుకునే క్రమంలో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. సెల్ఫీ తీసుకునేందుకు దగ్గరికి వచ్చిన వారిని పక్కకు తోసేస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ ఏనుగు వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి సెల్ఫీ తీసుకోవడానికి దగ్గరికి రావడంతో ఏనుగు వింతగా ప్రవర్తించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘ఈ ఏనుగు మరీ రొమాంటిక్‌గా ఉందే’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పర్యాటకులంతా ఏనుగు వద్దకు వెళ్లి ఫొటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో ఓ యువతి కూడా దాని సమీపానికి వెళ్లి (Woman takes selfie with Elephant) సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఫొటో తీసుకునే క్రమంలో ఏనుగు తన తొండంతో యువతి చెంపను ముద్దాడింది.
చిన్నపిల్లలను ముద్దు చేసిన చందంగా.. ఈ ఏనుగు కూడా ఆ యువతిని (Elephant kissing young woman) తొండంతో ముద్దు పెట్టుకుంటుంది. ఏనుగు విచిత్ర ప్రవర్తన చూసి ఆ యువతితో పాటూ అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు. సాధారణంగా పక్కకు తోయడమో, లేక సైలెంట్‌గా నిలబడి ఉండడమో చేసే ఏనుగు.. ఇలా విచిత్రంగా ప్రవర్తించడం చూపరులను ఆకట్టుకుంటోంది.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ ఏనుగు భలే రొమాంటిక్ గురూ’.. అంటూ కొందరు, ‘ఇది మరీ చిలిపి సుమీ’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 4.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
కోబ్రా విషం ఎంత డేంజరో తెలుసా.. కాటేయగానే ఏం జరిగిందో చూడండి..
రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి