Cheetah Viral Video: వేటాడే ముందు చిరుత చేసే పనేంటో తెలుసా.. వీడియో చూస్తే..
ABN , Publish Date - Jul 12 , 2025 | 06:35 PM
ఆకలితో ఉన్న ఓ చిరుత వేటకు సమాయత్తమైంది. ఈ క్రమంలో రోడ్డు పైకి వెళ్లిన చిరుత.. ఒక్కసారిగా ఆగిపోయింది. ఏం చేస్తుందబ్బా అని చూసేలోపే రెండు కాళ్లపై నిలబడింది. ఈ క్రమంలో దాని నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

చిరుత పులి వేట ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెరుపు వేగంతో దూసుకెళ్లి మరీ వేటపై పంజా విసురుతుంది. ఒక్క సారి దాని కంట పడిన ఏం జంతువూ దాదాపు తప్పించుకోలేవు. అలాగే చిరుత పులులు కొన్నిసార్లు ఎంతో తెలివితో వేటాడుతుంటాయి. దూరం నుంచి జంతువులను గుర్తించి, ఎంతో నైపుణ్యంతో వేటాడుతుంటాయి. ఇలాంటి వింత సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, వేట సమయంలో ఓ చిరుత ప్రవర్తన చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘చిరుత విన్యాసాలు మామూలుగా లేవుగా’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో చిరుతకు సంబంధించిన వీడియో (Viral Video) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ చిరుత వేటకు సమాయత్తమైంది. ఈ క్రమంలో రోడ్డు పైకి వెళ్లిన చిరుత.. ఒక్కసారిగా ఆగిపోయింది. ఏం చేస్తుందబ్బా అని చూసేలోపే రెండు కాళ్లపై నిలబడింది.
ముందుగా రెండు కాళ్లపై నిలబడ్డ చిరుత దూరంగా ఉన్న జంతువులను తదేకంగా చూసింది. ఆ తర్వాత కంగారు తరహాలో పూర్తిగా పైకి లేచి నిలబడి మరీ పరిశీలించింది. ఈ సమయంలో దాని ప్రవర్తన అచ్చం మనుషుల్లాగే అనిపించింది. ఆ తర్వాత వేటను టార్గెట్ చేసిందో ఏమో గానీ.. మెల్లగా రోడ్డు దాటి గడ్డి పొదల్లోకి వెళ్లిపోయింది. ఇలా ఈ చిరుత వేటకు ముందు ఇలా విచిత్ర విన్యాసాలు (Cheetah performing stunts on road) చేసి అందరినీ ఆకట్టుకుంటోందన్నమాట.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘చిరుత విన్యాసాలు మామూలుగా లేవుగా’.. అంటూ కొందరు, ‘నిశ్శబ్దంగా.. తెలివితో వేటాడడంలో చిరుతలు ముందుంటాయి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2,800లకు పైగా లైక్‌లు, 99వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
కోబ్రా విషం ఎంత డేంజరో తెలుసా.. కాటేయగానే ఏం జరిగిందో చూడండి..
రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి