Gorilla Funny Video: భార్య ముందు వేషాలేస్తే బడితపూజే.. ఈ గొరిల్లా చేసిన పని చూస్తే పగలబడి నవ్వుతారు..
ABN , Publish Date - Jul 11 , 2025 | 09:43 PM
గడ్డిలో కూర్చొన్న మగ గొరిల్లా వద్దకు ఓ యువతి వెళ్లి నిలబడింది. దాన్ని ఆసక్తిగా గమనిస్తుండగా.. సదరు యువతికి గొరిల్లా షాక్ ఇచ్చింది. ఆమె జుట్టును పట్టుకుని దగ్గరికి లాక్కుంది. దీంతో ఆ యువతి ఒక్కసారిగా షాకైంది. అయితే చివరకు ఏమైందో చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు..

చింపాంజీలు, గొరిల్లాలు మనుషులను మక్కీకి మక్కీ దింపేయడం చూస్తుంటాం. మనుషులు చేసే అన్ని పనులనూ అచ్చం అలాగే చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. కొన్నిసార్లు అవి చేసే పనులు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మగ గొరిల్లా యువతి జుట్టు పట్టుకుని లాగుతుంది. ఇది గమనించిన ఆడ గొరిల్లా చివరకు ఏం చేసిందో చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గడ్డిలో కూర్చొన్న మగ గొరిల్లా వద్దకు ఓ యువతి వెళ్లి నిలబడింది. దాన్ని ఆసక్తిగా గమనిస్తుండగా.. సదరు యువతికి గొరిల్లా షాక్ ఇచ్చింది. ఆమె జుట్టు పట్టుకుని (Gorilla Grabs young woman hair) దగ్గరికి లాక్కుంది. దీంతో ఆ యువతి ఒక్కసారిగా షాకైంది. దాన్నుంచి విడిపించుకోవాలని ఎంత ప్రయత్నించినా గొరిల్లా మాత్రం జుట్టును అలాగే పట్టుకుంది.
అయితే ఇంతలో ఆడ గొరిల్లా అక్కడికి వస్తుంది. తన పక్కనే కూర్చొన్న ఆడ గొరిల్లాను చూసి మగ గొరిల్లా యువతి జుట్టును వెంటనే వదిలేసింది. దొరికిపోయానురా బాబోయ్.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ సైలెంట్‌గా కూర్చుంటుంది. అప్పటికే కోపంతో ఊగిపోతున్న ఆడ గొరిల్లా.. ‘ఎన్నిసార్లు చెప్పాలి నీకు.. ఇలాంటి పిచ్చి వేషాలు వేయొద్దని.. ఈ రోజు నిన్ను వదిలేదే లేదు’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ మగ గొరిల్లా జుట్టు పట్టుకుంటుంది. అంతటితో ఆగకుండా (Female gorilla attacks male gorilla) దాన్ని పల్టీలు కొట్టించి మరీ పిచ్చి పిచ్చిగా కొడుతుంది.
ఆడ గొరిల్లా చేసిన పని చూసి అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మనుషుల్లో అయినా జంతువుల్లో అయినా భార్య అంటే భార్యే’.. అంటూ కొందరు, ‘మగ గొరిల్లాను ఉరికించి ఉరికించి కొట్టిందిగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 47 వేలకు పైగా లైక్‌లు, 4.7 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
కోబ్రా విషం ఎంత డేంజరో తెలుసా.. కాటేయగానే ఏం జరిగిందో చూడండి..
రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి