Watch Video: గ్యాస్ స్టవ్ అందంగా ఉందని ముట్టుకుంటే అంతే.. తిప్పి చూడగా షాకింగ్ సీన్..
ABN , Publish Date - Jul 13 , 2025 | 09:35 AM
ఓ ఇంటి వంట గదిలో షాకింగ్ సీన్ కనిపించింది. కిచెన్‌లోని గ్యాస్ స్టవ్ ఎంతో అందంగా ఉంది. గ్యాస్ స్టవ్ అందంగా ఉంటే షాకవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. గ్యాస్ స్టవ్ సమీపానికి వెళ్లగానే చప్పుడు రావడంతో..

ఇళ్లల్లోని వస్తువులు కొన్నిసార్లు భయపెడుతుంటాయి. వస్తువులేంటీ.. భయపెట్టడమేంటీ.. అని అనుకుంటున్నారా. వస్తువులు భయపెట్టకపోయినా.. వాటి మాటున దాగి ఉండే అనేజ జీవుల కారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటుంది. ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు గానీ.. ఉన్నట్టుండి బల్లులు, బొద్దింకలు, కప్పలు, పాములు.. ఇలా అనేక జీవులు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందంగా ఉన్న గ్యాస్ స్టవ్ కింద షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ముట్టుకుంటే మటాషే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంటి వంట గదిలో షాకింగ్ సీన్ కనిపించింది. కిచెన్‌లోని గ్యాస్ స్టవ్ ఎంతో అందంగా ఉంది. గ్యాస్ స్టవ్ అందంగా ఉంటే షాకవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. గ్యాస్ స్టవ్ సమీపానికి వెళ్లగానే చప్పుడు రావడంతో ఏముందా.. అని సందేహం వచ్చింది.
చివరకు గ్యాస్ స్టవ్‌ను పైకి ఎత్తి చూడగా.. అడుగున షాకింగ్ సీన్ కనిపించింది. స్టవ్ కింద ఓ కోబ్రా బుసలు (Cobra under the gas stove) కొడుతూ కనిపించింది. వంట చేసే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. చివరకు స్నేక్ క్యాచర్ ఆ పామును తీసి, సురక్షిత ప్రాంతంలో వదిలేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇకపై వంట చేసేముందు చెక్ చేసుకోవాల్సిందే’.. అంటూ కొందరు, ‘ఇకపై స్టవ్ చూసినప్పుడల్లా ఈ సీనే గుర్తుకొస్తుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.25 లక్షలకు పైగా లైక్‌లు, 12. 6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
కోబ్రా విషం ఎంత డేంజరో తెలుసా.. కాటేయగానే ఏం జరిగిందో చూడండి..
రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం