Share News

Drunken Man Funny Video: తల పోయినా.. తగ్గేదేలేదు.. వైన్ షాపులో ఇతడికేమైందో చూస్తే..

ABN , Publish Date - Jul 13 , 2025 | 07:58 AM

ఓ వ్యక్తి మద్యం కోసం వైన్ షాపునకు వస్తాడు. అయితే జనం రద్దీగా ఉన్నారో ఏమో తెలీదు గానీ.. మందు బాటిల్ తీసుకునే సమయంలో ఏకంగా ఇనుప గ్రిల్‌ లోపల అతడి తల ఇరుక్కుపోయింది. తల గ్రిల్ నుంచి అవతలి వైపు అయితే వెళ్లింది కానీ..

Drunken Man Funny Video: తల పోయినా.. తగ్గేదేలేదు.. వైన్ షాపులో ఇతడికేమైందో చూస్తే..

మందుబాబుల ప్రవర్తన కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ఉంటుంది. కొందరు ఫుల్‌గా మందు కొట్టి పాములతో పరాచకాలు ఆడుతుంటారు. మరికొందరేమో పీకల దాదా తాగి రోడ్లపై హల్‌చల్ చేస్తుంటారు. ఇంకొందరు మందు కోసం ఎలాంటి సహాసాలు చేయడానికైనా వెనుకాడరు. అయితే ఇలాంటి సమయాల్లో కొందరికి షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి షాపులో మందు బాటిల్ తీసుకుంటుండగా.. షాకింగ్ తల ఇనుప గ్రిల్‌లో ఇరుక్కుపోయింది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మద్యం కోసం వైన్ షాపునకు వస్తాడు. అయితే జనం రద్దీగా ఉన్నారో ఏమో తెలీదు గానీ.. మందు బాటిల్ తీసుకునే సమయంలో ఏకంగా (Drunken man's head stuck in an iron grill) ఇనుప గ్రిల్‌ లోపల అతడి తల ఇరుక్కుపోయింది. తల గ్రిల్ నుంచి అవతలి వైపు అయితే వెళ్లింది కానీ.. తర్వాత వెనక్కు తీసుకుందామంటే రాలేదు.


తల బయటికి రాకపోవడంతో మందుబాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఎంత గింజుకున్నా కూడా తల మాత్రం బయటికి రాలేదు. పక్కన ఉన్న వారు ఇనుప చువ్వలను లాగి, అతన్ని బయటికి లాగాలని చూశారు. కానీ ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అయితే చివరకు ఎలాగోలా ఆ మందుబాబు అందులో నుంచి బయటపడ్డాడు. దీంతో ‘హమ్మయ్య.. చచ్చి బతికానురా బాబోయ్’.. అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.


కాగా, ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మందు కోసం ఇలాంటి సాహసాలు ఎన్నైనా చేస్తాం’.. అంటూ కొందరు, ‘మందుబాబు టాలెంట్ మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

కోబ్రా విషం ఎంత డేంజరో తెలుసా.. కాటేయగానే ఏం జరిగిందో చూడండి..

రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 08:03 AM