Share News

Desi Jugaad Viral Video: ఈమె తెలివి అమోఘం.. తాళం పాడవకుండా ఏం చేసిందంటే..

ABN , Publish Date - Jul 19 , 2025 | 12:30 PM

వర్షాలకు తాళం పాడవకుండా ఓ మహిళ జాగ్రత్తలు తీసుకుంది. అది కూడా ఎవరూ చేయని విధంగా వింత టెక్నిక్‌ను ప్రయోగించింది. ఇందుకోసం ఆమె ఓ ప్లాస్టిక్ బాటిల్‌ను తీసుకుంది. దాన్ని కొంత వరకూ సగానికి కత్తిరించింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

Desi Jugaad Viral Video:  ఈమె తెలివి అమోఘం.. తాళం పాడవకుండా ఏం చేసిందంటే..

ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాగైతే అనేక జాగ్రత్తలు తీసుకుంటామో.. ఇళ్లల్లోని వస్తువులు, వాహనాలు పాడవకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ మహిళ తన ఇంటి తాళం వర్షానికి పాడవకుండా వింత టెక్నిక్ వాడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈమె ఐడియా మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వర్షాలకు తాళం పాడవకుండా ఓ మహిళ జాగ్రత్తలు తీసుకుంది. అది కూడా ఎవరూ చేయని విధంగా వింత టెక్నిక్‌ను ప్రయోగించింది. ఇందుకోసం ఆమె ఓ ప్లాస్టిక్ బాటిల్‌ను తీసుకుంది. దాన్ని కొంత వరకూ సగానికి కత్తిరించింది.


తాళం వేసిన తర్వాత దానికి ఈ బాటిల్‌ను (Woman wears plastic bottle as lock) తొడుగులాగా వాడింది. తాళానికి బాటిల్‌ను తొడిగిన తర్వాత.. దానికి మూత బిగించేసింది. ఇలా చేయడం వల్ల ఎంత వర్షం పడినా కూడా తాళంలోకి నీళ్లు వెళ్లే అవకాశం ఉండదు. ఇలా పక్కన పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌తో తన ఇంటి తాళాన్ని రక్షించుకుందన్నమాట.


కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈమె తెలివి మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2900కి పైగా లైక్‌లు, 8.41 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెనుక వేలాడుతున్న పాము.. చివరకు..

కోబ్రా విషం ఎంత డేంజరో తెలుసా.. కాటేయగానే ఏం జరిగిందో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 12:31 PM