Share News

Wedding Funny Video: వధువును కౌగిలించుకున్న ప్రియురాలు.. వరుడిపై ఎలా కసి తీర్చుకుందో చూస్తే..

ABN , Publish Date - Jul 19 , 2025 | 11:15 AM

పెళ్లి వేదికపై వధూవరులుతో బంధువులంతా ఫొటోలు దిగుతున్నారు. ఇంతలో ఓ యువతి వేదికపైకి వెళ్లింది. వెళ్లీ వెళ్లగానే వధువును కౌగిలించుకుంది. అయితే అదే సమయంలో వధువు వెనుక ఉన్న వరుడి గడ్డం పట్టుకుని తలను పక్కకు తోసేసింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

Wedding Funny Video: వధువును కౌగిలించుకున్న ప్రియురాలు.. వరుడిపై ఎలా కసి తీర్చుకుందో చూస్తే..

ప్రస్తుతం పెళ్లిళ్లు జరిగే తీరు చిత్రవిచిత్రంగా ఉంటోంది. పెళ్లి మంటపంలో ఏర్పాట్లు చేసే సమయంలోనే.. ఆ వధూవరులను ఎలా వైరల్ చేయాలనే దానిపై వివిధ రకాలుగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరికి మించి మరొకరు చిత్రవిచిత్రమైన స్కిట్లను ప్లాన్ చేసుకుంటున్నారు. అన్నీ కలిసి వీడియోల రూపంలో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వరుడి ఎదుటే వధువును కౌగిలించుకున్న ప్రియురాలు.. ఆ తర్వాత చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘చెంపపై కొట్టి.. చేతులు కలిపిందిగా.. ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) వైరల్ అవుతోంది. పెళ్లి వేదికపై వధూవరులుతో (Bride and groom) బంధువులంతా ఫొటోలు దిగుతున్నారు. ఇంతలో ఓ యువతి వేదికపైకి వెళ్లింది. వెళ్లీ వెళ్లగానే వధువును కౌగిలించుకుంది. అయితే అదే సమయంలో వధువు వెనుక ఉన్న వరుడి గడ్డం పట్టుకుని తలను పక్కకు తోసేసింది.


ఆ తర్వాత ఫెడేల్‌మని (Girlfriend Slapped Groom) చెంప చెల్లుమనిస్తుంది. దెబ్బకు వరుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయితే చివరగా ఆమె వరుడి చేయి పట్టుకుని లాగి, వధువు చేతిని కలిపి.. సంతోషంగా ఉండడంటూ ఆశీర్వదించి వెళ్లిపోతుంది. ఈ ఘటన చూసి అక్కడున్న వారిలో కొందరు షాక్ అవగా.. మరికొందరు తెగ నవ్వుకున్నారు. చూస్తుంటే ఇదంతా వ్యూస్ కోసం కావాలని ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వరుడికి మామూలు షాక్ ఇవ్వలేదుగా’.. అంటూ కొందరు, ‘అంతా చాలా బాగా యాక్టింగ్ చేశారు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెనుక వేలాడుతున్న పాము.. చివరకు..

కోబ్రా విషం ఎంత డేంజరో తెలుసా.. కాటేయగానే ఏం జరిగిందో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 11:19 AM