Share News

Crocodile Viral Video: చేపపై దాడి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుందిగా.. ఈ మొసలికి ఏమైందో చూస్తే..

ABN , Publish Date - Jul 18 , 2025 | 03:59 PM

నదిలో మొసలి వేట కోసం ఎదురు చూస్తుంటుంది. చివరకు ఓ పెద్ద చేప అటుగా వస్తుంది. చేపను చూసిన మొసలి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాడి చేస్తుంది. అయితే ఈ క్రమంలో చివరకు ఏమైందో మీరే చూడండి..

Crocodile Viral Video:  చేపపై దాడి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుందిగా.. ఈ మొసలికి ఏమైందో చూస్తే..

చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇది మనుషులకే కాదు జంతువులకూ వర్తిస్తుంది. పులి, సింహాల దాడిలో చనిపోతాయనుకున్న జంతువులు.. ఊహించని విధంగా ప్రాణాలతో బయటపడుతుంటాయి. అలాగే మరికొన్నిసార్లు వేటాడే సమయంలో అవే దాడికి గురవుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మొసలి చేపను వేటాడేందుకు ఒడ్డు సమీపానికి వచ్చింది. ఈ క్రమంలో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ నదిలో మొసలి వేట కోసం ఎదురు చూస్తుంటుంది. అయితే దానికి ఎలాంటి జంతువూ కనిపించదు. చివరకు ఓ పెద్ద చేప అటుగా వస్తుంది. చేపను చూసిన మొసలి.. ‘ఈ పూటకు ఈ చేపతో సరిపెట్టుకుందాం’.. అని అనుకుంటూ.. వెంటనే ఒడ్డు సమీపానికి వెళ్లి, (Crocodile attacking fish) దానిపై దాడి చేస్తుంది. చేపను నోట కరుచుకుని మింగే ప్రయత్నం చేస్తుంటుంది.


అయితే ఇంతలో ఆ నది ఒడ్డున పొంచిఉన్న జాగ్వార్.. మొసలి పైకి దూకింది. దూకీ దూకగానే మొసలి (Jaguar drags crocodile to shore) మెడ పట్టుకుని ఒడ్డుకు లాక్కెళ్లిపోయింది. జాగ్వార్ నుంచి తప్పించుకోవడానికి మొసలి అనేక రకాలుగా ప్రయత్నించింది. అయినా దాని వల్ల సాధ్యం కాలేదు. ఈ ఘటన చూస్తుంటే జాగ్వార్ దాడిలో మొసలి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరిగింది. కొందరు దీన్ని తమ కెమెరాల్లో బంధించారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ చేప చావును వెంటబెట్టుకుని వచ్చిందిగా’.. అంటూ కొందరు, ‘చేపను తినాలని చూస్తే షాక్ తగిలిందిగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 19 లక్షలకు పైగా లైక్‌లు, 114 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెనుక వేలాడుతున్న పాము.. చివరకు..

కోబ్రా విషం ఎంత డేంజరో తెలుసా.. కాటేయగానే ఏం జరిగిందో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 03:59 PM