Pakistan Floods: పాకిస్తాన్‌లో ఇంత దారుణంగా ఉందా.. వరద నీటిలో లైవ్‌లో మాట్లాడుతున్న జర్నలిస్ట్.. చూస్తుండగానే..
ABN , Publish Date - Jul 18 , 2025 | 03:18 PM
రావల్పిండిలోని చాహన్ ఆనకట్ట సమీపంలోని నది ఉదృతంగా ప్రవహిస్తోంది. అక్కడి వరద పరిస్థితులను ఓ జర్నలిస్ట్ లైవ్‌లో వివరిస్తున్నాడు. అది కూడా పూర్తిగా వరద నీటిలోకి దిగిపోయి.. నీరు మెడ వరకు ప్రవహిస్తుండగా చేతిలో మైక్ పట్టుకుని వివరిస్తున్నాడు. ఇంత వరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..

పాకిస్తాన్‌లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసిన వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మరో వైపు అనేక మంది స్థానికులు, పర్యాటకులు.. వరద నీటిలో కొట్టుకుపోయి చనిపోతున్నారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వరద నీటిలో లైవ్ కవరేజ్ ఇస్తున్న జర్నలిస్ట్.. చూస్తుండగానే అందులో కొట్టుకుపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పాకిస్తాన్‌లో (Pakistan) రావల్పిండిలోని చాహన్ ఆనకట్ట సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే . ఈ కారణంగా వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల (floods) బీభత్సానికి పాకిస్తాన్ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 116 మంది మృత్యువాత పడినట్లు సమాచారం . వరదల్లో కొట్టుకుపోయిన పర్యాటకులకు సంబంధించిన వీడియోలు గతంలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, వరదలో లైవ్ రిపోర్ట్ ఇస్తున్న ఓ జర్నలిస్ట్.. చూస్తుండగానే వరదలో కొట్టుకుపోవడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
రావల్పిండిలోని చాహన్ ఆనకట్ట సమీపంలోని నది ఉదృతంగా ప్రవహిస్తోంది. అక్కడి వరద పరిస్థితులను ఓ జర్నలిస్ట్ లైవ్‌లో వివరిస్తున్నాడు. అది కూడా పూర్తిగా వరద నీటిలోకి దిగిపోయి.. నీరు మెడ వరకు ప్రవహిస్తుండగా చేతిలో మైక్ పట్టుకుని వివరిస్తున్నాడు. ఇంత వరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. వరద పరిస్థితులను వివరిస్తుండగానే.. (Journalist washed away in floodwaters) నీటి ఉదృతి ఎక్కువై కొట్టుకుపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాల్సి ఉంది. ఈ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. కొందరు జర్నలిస్ట్ ధైర్యసాహసాలను ప్రశంసిస్తుండగా.. రేటింగ్ కోసం ఇలా ప్రమాదకర పరిస్థితిలో లైవ్ ఇవ్వడం అవసరమా.. అంటూ మరికొందరు అంటున్నారు.
మరోవైపు వరదల దాటికి చాహన్ ఆనకట్ట కూలిపోయింది. రావల్పిండితో సహా చాలా ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. వందలాది ఇళ్లు వరదల దాటికి దెబ్బతిన్నాయి. అలాగే పలు ప్రాంతల్లో విద్యుత్, తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదల దాటికి పాకిస్తాన్ వ్యాప్తంగా 116 మంది ప్రాణాలు కోల్పోగా.. 250 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల్లో పంజాబ్ ప్రావిన్స్‌లో అధికంగా 44 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అలాగే ఖైబర్ పఖ్తుుంఖ్వాలో 37 మంది, సింథ్‌లో 18 మంది, బలూచిస్తాన్‌లో 19 మంది చనిపోయినట్లు సమాచారం. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ టీం సహాయక చర్యలను ముమ్మరం చేస్తోంది.
కాగా, వరద నీటిలో కొట్టుకుపోయిన జర్నలిస్ట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘టీఆర్పీ కోసం జర్నిలిస్ట్ ప్రాణాలతో ఆడుకుంటున్నారు’.. అంటూ కొందరు, ‘వరదల సమయంలో ఇలాంటి ప్రమాదకర పనులు ఎవరూ చేయకండి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటిదాకా 44 వేల మందికి పైగా వీక్షించారు.
ఇవి కూడా చదవండి..
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెనుక వేలాడుతున్న పాము.. చివరకు..
కోబ్రా విషం ఎంత డేంజరో తెలుసా.. కాటేయగానే ఏం జరిగిందో చూడండి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి