Snake Viral Video: సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెనుక వేలాడుతున్న పాము.. చివరకు..
ABN , Publish Date - Jul 13 , 2025 | 01:36 PM
ఓ వ్యక్తి సైకిల్‌పై వెళ్తున్నాడు. సైకిల్‌కు వెనుక వైపు ఓ పెద్ద పాము వేలాడుతోంది. సైకిల్ వెనుక పైకి ఎక్కిన పాము.. తలను అటూ, ఇటూ తిప్పుతూ ఉంది. వెనుక పాము ఉందనే విషయం తెలీని ఆ వ్యక్తి..

పాములు ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో కనిపిస్తాయో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు మంచాల కింద, మరికొన్నిసార్లు సీలింగ్ ఫ్యాన్ల పైనా, ఇంకొన్నిసార్లు సిలిండర్లు.. గ్యాస్ స్టవ్‌ల కిందా కనిపిస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి సైకిల్‌పై వెళ్తుండగా.. వెనుక పాము వేలాడుతోంది. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సైకిల్‌పై వెళ్తున్నాడు. సైకిల్‌కు వెనుక వైపు (Snake hanging from back of bicycle) ఓ పెద్ద పాము వేలాడుతోంది. సైకిల్ వెనుక పైకి ఎక్కిన పాము.. తలను అటూ, ఇటూ తిప్పుతూ ఉంది. వెనుక పాము ఉందనే విషయం తెలీని ఆ వ్యక్తి.. జాలీగా సైకిల్ తొక్కుతున్నాడు.
వెనుక వెళ్తున్న వారు ఈ సీన్ చూసి షాక్ అయ్యారు. ఆ పాము ఎక్కడ ఆ వ్యక్తిని కాటేస్తుందోమే అని అంతా భయపడ్దారు. అయితే పాము కాసేపటికి సైకిల్‌పై నుంచి దూకేసి రోడ్డు పక్క నుంచి గడ్డిలోకి వెళ్లిపోయింది. దీంతో అంతా హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘సైకిల్ రైడ్ ఎంజాయ్ చేస్తున్న పాము’.. అంటూ కొందరు, ‘ఇతడి టైం ఎంతో బాగుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 20.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
కోబ్రా విషం ఎంత డేంజరో తెలుసా.. కాటేయగానే ఏం జరిగిందో చూడండి..
రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి