Traffic Police Funny Video: అసలు సిసలైన ట్రాఫిక్ పోలీస్.. లైన్ క్రాస్ చేయకుండా ఏం చేశాడో చూస్తే..
ABN , Publish Date - Jul 13 , 2025 | 12:13 PM
కూడలిలో రెడ్ సిగ్నల్ పడడంతో వాహనదారులంతా ఆగారు. అయితే వారిలో ఇద్దరు బైకర్లు జీబ్రా లైన్లు క్రాస్ చేసి ముందుకు వెళ్లి ఆగారు. అప్పటికే పలుమార్లు చెప్పి చూసిన ట్రాఫిక్ పోలీసుకు.. చివరకు చిర్రెత్తుకొచ్చి ఏం చేశాడో చూడండి..

వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్ చేయడం సర్వసాధారణమైంది. కొందరైతే ట్రాఫిక్ పోలీసులు వారిస్తున్నా కూడా సిగ్నల్ జంపింగ్ చేస్తుంటారు. మరికొందరు జీబ్రా లైన్లను దాటి ముందు ముందుకు వెళ్తుంటారు. ఇలాంటి వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పిలా మారుతుంటారు. అయితే ఓ ట్రాఫిక్ పోలీస్.. ఇలాంటి వాహనదారులకు తల బొప్పి కట్టేలా చేస్తున్నాడు. ఈ పోలీస్ చేసిన పనికి సిగ్నల్ జంపింగ్ చేయాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘జీబ్రా టాస్క్‌ఫోర్స్ ఇంటే ఇదేనేమో’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కూడలిలో (Traffic signals) రెడ్ సిగ్నల్ పడడంతో వాహనదారులంతా ఆగారు. అయితే వారిలో ఇద్దరు బైకర్లు జీబ్రా లైన్లు (Zebra lines) క్రాస్ చేసి ముందుకు వెళ్లి ఆగారు. అప్పటికే పలుమార్లు చెప్పి చూసిన ట్రాఫిక్ పోలీసుకు.. చివరకు చిర్రెత్తుకొచ్చింది.
వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి బైకు పైకి జంప్ చేస్తాడు. ఆ బైకర్ భుజంపై కూర్చుని, తన చేతిలోని స్టిక్‌తో (Traffic police hits on biker helmet with stick) అతడి హెల్మెట్‌పై చితకబాదేశాడు. దెబ్బకు ఆ బైకర్ షాక్ అయ్యాడు. వెంటనే వాహనాన్ని వెనక్కు తీసుకొస్తాడు. పూర్తిగా జీబ్రా లైన్ల వెనక్కు వచ్చేదాకా అతడి హెల్మెట్‌పై కొడుతూనే ఉన్నాడు. అతన్ని చితకబాదడం చూసి ఆ పక్కన ఉన్న బైకర్లంతా దెబ్బకు సెట్ అవుతారు. ఇలా జీబ్రా లైన్లు క్రాస్ చేసిన బైకర్లకు ఈ ట్రాఫిక్ పోలీసు.. వినూత్న రీతిలో బుద్ధి చెప్పాడన్నమాట.
ఈ ఘటన ఆఫ్రికాలో జరిగిందంటూ చాలా మంది చెబుతున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘జీబ్రా టార్క్‌ఫోర్స్ పోలీస్ అంటే ఇతనే’.. అంటూ కొందరు, ‘జరిగింది ఏ దేశంలో అయినా.. ప్రతి దేశంలో ఇలాంటి పోలీస్ ఒకరుండాలి’. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1700కి పైగా లైక్‌లు, 8.33 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
కోబ్రా విషం ఎంత డేంజరో తెలుసా.. కాటేయగానే ఏం జరిగిందో చూడండి..
రోడ్డు పక్కన పడుకున్న మందుబాబు.. సమీపానికి వెళ్లిన చిరుత.. వాసన చూడడంతో..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి