Share News

Marriage Funny Video: ఫొటోగ్రాఫర్‌కు షాక్ ఇచ్చిన వరుడు.. వధువుకు ఫొటోలు తీయడం చూసి..

ABN , Publish Date - Jul 18 , 2025 | 05:56 PM

ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు వేదికపై దండలు మార్చుకుని ఫొటోలు తీసుకుంటూ ఉంటారు. ఫొటో‌గ్రాఫర్ వధువుకు వివిధ యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తుంటాడు. ఈ క్రమంలో వధువును పదే పదే తాకుతుంటాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Marriage Funny Video: ఫొటోగ్రాఫర్‌కు షాక్ ఇచ్చిన వరుడు.. వధువుకు ఫొటోలు తీయడం చూసి..

వివాహం అంటేనే ప్రస్తుతం వినోదానికి అడ్డాగా మారిపోయింది. సినిమాల్లో కనిపించే కామెడీ మొత్తం పెళ్లిళ్లలోనే చూస్తుంటాం. దీంతో ప్రతి వివాహంలోనే ఏదో ఒక వింత సంఘటన ఉండేలా అంతా ప్లాన్ చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ఎలాంటి ప్లాన్ లేకుండానే ఫన్నీ ఫన్నీ సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో ఫొటో‌గ్రాఫర్.. వధువుకు ఫొటోలు తీస్తు్న్న సమయంలో వరుడు చూశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో వధూవరులు వేదికపై దండలు మార్చుకుని ఫొటోలు తీసుకుంటూ ఉంటారు. ఫొటో‌గ్రాఫర్ వధువుకు వివిధ యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తుంటాడు. ఈ క్రమంలో వధువును పదే పదే తాకుతుంటాడు. పక్కనే ఉన్న వరుడు.. ఫొటో‌గ్రాఫర్ నిర్వాకాన్ని తదేకంగా గమనిస్తాడు.


పదే పదే వధువును తాకడం చూసి అతడికి చిర్రెత్తుకొస్తుంది. చివరకు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక.. (groom attacks photographe) ఫొటోగ్రాఫర్‌పై పిడి గుద్దులు కురిపించాడు. దీంతో అప్పటిదాకా వివిధ యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తున్న అతను.. ఒక్కసారిగా అవాక్కవుతాడు. ఈ సీన్ చూసి వధువు పగలబడి నవ్వుకుంటుంది. చూస్తుంటే.. ఇదంతా నవ్వుకోవడానికి కావాలని ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తున్నా వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘హస్బెండ్ ఆఫ్ ది ఇయర్’.. అంటూ కొందరు, ‘సినిమా షూటింగ్ సన్నివేశంలా ఉంది’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 800కి పైగా లైక్‌లు, 83 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెనుక వేలాడుతున్న పాము.. చివరకు..

కోబ్రా విషం ఎంత డేంజరో తెలుసా.. కాటేయగానే ఏం జరిగిందో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 05:56 PM