Scooty Viral Video: స్కూటీ అనుకున్నావా.. డీప్ ఫ్రిజ్ అనుకున్నావా.. ఇతనెలా వాడేశాడంటే..
ABN , Publish Date - Jul 19 , 2025 | 01:33 PM
స్కూటీపై వచ్చిన ఓ వ్యక్తి.. సీటు కింద వస్తువులను తీసేందుకు దాన్ని అన్‌లాక్ చేసి, పైకి ఎత్తాడు. ఇందులో విశేషం ఏముందీ.. అనేగా మీ సందేహం. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. కానీ అతడి సీటు పైకి ఎత్తగానే లోపలి దృశ్యం చూసి అంతా అవాక్కవుతున్నారు..

వాహనాలను చిత్రవిచిత్రంగా మారుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం తరచూ చూస్తున్నాం. ఇటీవల ఇలాంటి ప్రయోగాలు ఎక్కువైపోయాయి. బైకు ఇంజిన్‌ను నీళ్ల మోటారుగా వాడడం, సైకిల్ చక్రాలు.. ఇనుప కడ్డీలతో గుర్రపు బండిని తయారు చేయడం, కారును స్విమ్మింగ్‌పూల్‌గా మార్చడం వంటి వినూత్న ప్రయోగాలను నిత్యం చూస్తుంటాం. ఇలాంటి వింత సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి స్కూటీని వాడిన విధానం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియో చూసి వారంతా.. ‘స్కూటీని ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. స్కూటీపై వచ్చిన ఓ వ్యక్తి.. సీటు కింద వస్తువులను తీసేందుకు దాన్ని అన్‌లాక్ చేసి, పైకి ఎత్తాడు. ఇందులో విశేషం ఏముందీ.. అనేగా మీ సందేహం. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. కానీ అతడి సీటు పైకి ఎత్తగానే లోపలి దృశ్యం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సీటు కింద వస్తువులు ఉండాల్సింది పోయి.. అందుకు బదులుగా ఐస్ ముక్కలు, వాటి మధ్యలో (Ice cubes and beer bottles under the Scooty seat) బీరు బాటిళ్లు కనిపించాయి. డీప్ ఫ్రిడ్జ్‌లో ఎలాగైతే బీరు బాటిళ్లను స్టోర్ చేస్తారో.. అచ్చం అలాగే ఇతను స్కూటీ సీటు కింద ఐస్ ముక్కలు వేసి, అందులో బీరు బాటిళ్లను స్టోర్ చేసేశాడు. సీటు పైకి ఎత్తి ఎంచక్కా ఆ బీర్లను తీసుకుని స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఇలా స్కూటీ సీటును కాస్తా ఐస్ బాక్స్‌లా మార్చేసి, అంతా అవాక్కయ్యేలా చేస్తున్నాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘బీర్లు దాచడానికి బెస్ట్ ప్లేస్’.. అంటూ కొందరు, ‘స్కూటీల వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.90 లక్షలకు పైగా లైక్‌లు, 6.9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెనుక వేలాడుతున్న పాము.. చివరకు..
కోబ్రా విషం ఎంత డేంజరో తెలుసా.. కాటేయగానే ఏం జరిగిందో చూడండి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి