Traffic: నా ఫ్రెండ్ దుబాయ్‌లో.. నేను ట్రాఫిక్‌లో.. యువతి పోస్టుపై నెటిజన్ల రియాక్షన్ చూస్తే..
ABN , Publish Date - Jul 20 , 2025 | 11:21 AM
దుబాయ్‌కు వెళ్తున్న స్నేహితురాలిని విమానాశ్రయంలో దింపిరావడానికి వెళ్లిన యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. స్నేహితురాలిని విమానం అయితే ఎక్కించి గానీ.. ఆ తర్వాత ఆమెకు చుక్కలు కనిపించాయి. తనకు ఎదురైన వింత అనుభవాన్ని వివరిస్తూ ఆమె షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది..

పట్టణాలు, నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి మహా నగరాల్లో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. కొన్నిసార్లు పది నిముషాల ప్రయాణానికి గంటలు గంటలు ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ట్రాఫిక్ సమస్యలపై సోషల్ మీడియాలో అనేక ఫన్నీ పోస్టులు దర్శనమిస్తుంటాయి. తాజాగా, బెంగళూరు యువతి పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ‘నా ఫ్రెండ్ దుబాయ్‌లో ఉంటే.. నేను ఇంకా బెంగళూరు ట్రాఫిక్‌లోనే ఉన్నా’.. అంటూ ఆమె షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు.
సోషల్ మీడియాలో బెంగళూరు (Bangalore young woman ) యువతి షేర్ చేసిన ట్రాఫిక్ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దుబాయ్‌కు వెళ్తున్న స్నేహితురాలిని విమానాశ్రయంలో దింపిరావడానికి వెళ్లిన యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. స్నేహితురాలిని విమానం అయితే ఎక్కించి గానీ.. ఆ తర్వాత ఆమెకు చుక్కలు కనిపించాయి. విమానాశ్రయం నుంచి తిరిగి వెళ్లే సమయలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.
గంటల కొద్దీ ట్రాఫిక్‌లో వేచి చూసిన ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. చివరకు తనకు ఎదురైన ఈ వింత అనుభవాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. నా స్నేహితురాలిని దుబాయ్ విమానం ఎక్కించాను.. ఆమె దుబాయ్ కూడా వెళ్లింది. కానీ నేనేమో ఇంకా బెంగళూరు ట్రాఫిక్‌లోనే ఉన్నాను.. అని ప్రస్తావిస్తూ ట్రాఫిక్ (Traffic) వీడియోను షేర్ చేసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు తమకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘నాకూ ఇలాగే జరిగింది.. నా తల్లిదండ్రులు నన్ను విమానాశ్రయంలో దింపారు.. నేనేమో ఢిల్లీ కూడా చేరుకున్నాను.. కానీ వాళ్లేమో అప్పటికీ ట్రాఫిక్‌లోనే ఉన్నారు’.. అంటూ ఓ వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్ని వివరించాడు. ‘ఇలాంటి సమయాల్లో వాహనం కంటే నడక ఎంతో మేలు’.. అంటూ మరికొందరు, ‘వామ్మో.. బెంగళూరులో మరీ ఇంత దారుణమా’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 లక్షలకు పైగా లైక్‌లు, 19.1 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఈమె తెలివి అమోఘం.. తాళం పాడవకుండా ఏం చేసిందంటే..
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెనుక వేలాడుతున్న పాము.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి