Fishing Viral Video: చేపల కోసం గాలం వేశాడు.. తీరా బయటికి వచ్చింది చూసి ఖంగుతిన్నాడు..
ABN , Publish Date - Jul 20 , 2025 | 07:39 AM
ఓ వ్యక్తి చేపలు పట్టేందుకు చెరువు ఒడ్డుకు వెళ్లాడు. అంతా సిద్ధం చేసుకుని, చేపల కోసం గాలం వేశాడు. ఇంతవరకూ అంతా బాగానే జరిగింది.. కానీ ఇప్పుడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చేపల కోసం గాలం వేసిన అతను.. కాసేపు అలాగే చూస్తూ నిలబడ్డాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

చేపలు పట్టడం కొందరికి సరదా అయితే.. మరికొందరికి జీవనాధారం. కొందరు గాలమేసి చేపలు పడుతుంటే.. ఇంకొందరు పడవలు, బోట్లలో వెళ్లి చేపలు పట్టడం చూస్తుంటాం. ఇదంతా సరే గానీ.. ఇప్పుడీ విషయం ఎందుకు చెబుతున్నారు.. అనేగా మీ సందేహం. చేపలు పట్టే సమయంలో కొందరికి షాకింగ్ అనుభవాలు ఎదురవుతుండడం చూస్తుంటాం. చేపల వలలో ఏవోవే జీవులు దర్శనమిస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చేపలకు గాలం వేయగా.. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. గాలమేశాడు.. ఖంగుతిన్నాడు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చేపలు పట్టేందుకు చెరువు ఒడ్డుకు వెళ్లాడు. అంతా సిద్ధం చేసుకుని, చేపల కోసం గాలం వేశాడు. ఇంతవరకూ అంతా బాగానే జరిగింది.. కానీ ఇప్పుడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చేపల కోసం గాలం (fishing) వేసిన అతను.. కాసేపు అలాగే చూస్తూ నిలబడ్డాడు.
ఇంతలో గాలం అటూ, ఇటూ కదలడంతో చాలా పెద్ద చేప పడిందని సంబరపడ్డాడు. వెంటనే గాలంతో దాన్ని బయటికి లాగేశాడు. నీళ్లలోంచి పెద్ద చేప బయటికి వస్తుందనుకుంటే.. చివరకు ఓ మొసలి బయటికి వచ్చి నోరు తెరిచి అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో అప్పటిదాకా సంబరంగా ఉన్న అతను.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే కొంచెంలో మొసలి (Crocodile) బారి నుంచి తప్పించుకోవడంతో.. హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘చేపకు గాలం వేస్తే ఇలా జరిగిందేంటీ’.. అంటూ కొందరు, ‘చేప వస్తుందనుకుంటే.. మొసలి వచ్చిందంటే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 78 వేలకు పైగా లైక్‌లు, 2.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఈమె తెలివి అమోఘం.. తాళం పాడవకుండా ఏం చేసిందంటే..
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెనుక వేలాడుతున్న పాము.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి