Accident Viral Video: అయ్యో.. ఎంత ఘోరం.. విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..
ABN , Publish Date - Apr 26 , 2025 | 07:36 PM
స్కూల్ వదలడంతో విద్యార్థినులంతా రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంటారు. మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అయ్యో.. ఎంత ఘోరం..’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

మృత్యువు ఎప్పుడు, ఎటు వైపు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేరు. సంతోషంగా ఉన్న వారు సడన్‌గా చావుకు దగ్గరవుతుంటారు. అలాగే నడుస్తూ వెళ్తున్న వారు ఉన్నట్టుండి కుప్పకూలి చనిపోతుంటారు. కొన్నిసార్లు కొందరరి తప్పు వల్ల ఇంకొందరు ప్రాణాల పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి హృదయ విదారక సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దారిలో నడుస్తూ వెళ్తున్న విద్యార్థులు ఉన్నట్టుండి ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘అయ్యో.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) డెహ్రాడూన్‌లో (Uttarakhand, Dehradun) ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ వదలడంతో విద్యార్థినులంతా రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంటారు. మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Woman Stunt Viral Video: వామ్మో.. ఇదెక్కడి టాలెంట్ బాబోయ్.. వేగంగా తిరిగే ఫ్యాన్‌ను సైతం..
అత్యంత వేగంగా వచ్చిన ఓ కారు ఇద్దరు విద్యార్థినులను (Car hits students) ఢీకొని వెళ్లిపోయింది. ఈ ఘటనలో వారిద్దరూ సుమారు 10 అడుగుల దూరం విరిసివేయబడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాలు కాగా.. మరికొంత మంది విద్యార్థినులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ విక్రాంత్ కుమార్‌గా గుర్తించారు. ఇతను రాష్ట్ర మానసిక ఆరోగ్య సంస్థలో కార్యకర్తగా పని చేస్తున్నట్లు తెలిసింది.
Snake's Honeymoon: పాములకూ హనీమూన్.. వేల సర్పాలన్నీ కలిసి ఒకే ప్రాంతంలో..
వాహనం నిర్లక్ష్యంగా నడిపినందుకు పోలీసులు అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఎంత ఘోరం జరిగంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలా నిర్లక్ష్యంగా వాహనం నడిపే వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 2 లక్షల మందికి పైగా వీక్షించారు.
Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..