Share News

Dog Viral Video: నీటిలో కొట్టుకుపోతున్న కుక్క.. సమయానికి గమనించిన మరో కుక్క.. చివరకు జరిగింది చూస్తే..

ABN , Publish Date - Apr 25 , 2025 | 06:50 PM

ఓ కుక్క ప్రమాదవశాత్తు నదిలో పడి కొట్టుకుపోతుంటుంది. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న మరో కుక్క దాన్ని గమనిస్తుంది. తన స్నేహితుడు ప్రమాదంలో ఉండడం చూసి చలించిపోతుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Dog Viral Video: నీటిలో కొట్టుకుపోతున్న కుక్క.. సమయానికి గమనించిన మరో కుక్క.. చివరకు జరిగింది చూస్తే..

సాటి మనిషి ప్రమాదంలో ఉంటే కాపాడాల్సింది పోయి.. సంబరపడే మనుషులన్న ప్రస్తుత రోజుల్లో మనుషుల కంటే జంతువులే నయం అనిపిస్తుంటుంది. తోటి జంతువు కష్టంలో ఉందంటే తమ ప్రాణాలు ఫణంగా పెట్టి కాపాడుతుంటాయి. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కుక్క నీళ్లలో కొట్టుకుపోతుండగా.. మరో కుక్క గమనించింది. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కుక్క ప్రమాదవశాత్తు (dog drowning in river) నదిలో పడి కొట్టుకుపోతుంటుంది. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న మరో కుక్క దాన్ని గమనిస్తుంది. తన స్నేహితుడు ప్రమాదంలో ఉండడం చూసి చలించిపోతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దాన్ని కాపాడేందుకు పరుగులు తీస్తుంది.

Toilets Funny Video: పేరుకు తగ్గట్టే పబ్లిక్ టాయిలెట్స్.. ఎలా ఉన్నాయో చూస్తే పగలబడి నవ్వుతారు..


కొంత దూరం ఆ కుక్కను అనుసరిస్తూ ఒడ్డుపైనే పరుగులు తీస్తుంది. అదును చూసి నీటిలోకి దూకి కుక్క చెవిని నోటితో పట్టుకుని ఒడ్డుకు లాగేస్తుంది. ఇలా ప్రమాదంలో ఉన్న సహచరుడిని తన ప్రాణాలకు తెగించి కాపాడిందన్నమాట. ఈ కుక్క చేసిన పని చూసి అంతా శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మనుషుల కంటే ఈ కుక్క ఎంతో నయం’’.. అంటూ కొందరు, ‘‘కుక్కను కాపాడాల్సింది పోయి వీడియో తీయడం ఏంటీ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 22 వేలకు పైగా లైక్‌లు, 9.68 లక్షలకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Funny Viral Video: డోర్ లాక్ చేసి మరీ డెత్ గేమ్.. ఈ కుర్రాళ్ల నిర్వాకం చూస్తే షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 25 , 2025 | 06:50 PM