Toilets Funny Video: పేరుకు తగ్గట్టే పబ్లిక్ టాయిలెట్స్.. ఎలా ఉన్నాయో చూస్తే పగలబడి నవ్వుతారు..
ABN , Publish Date - Apr 24 , 2025 | 09:08 PM
పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా ఒక్కో గదిలో ఒక కమోడ్‌ను మాత్రమే ఏర్పాటు చేస్తారు. అయితే వీరు నిర్మించిన టాయిలెట్స్ చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఆశ్చర్యం, ఆనందం, బాధ.. ఇలా అన్ని రకాల ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. కొందరు చేసే విచిత్రమైన పనులు చూసినప్పుడు తెగ నవ్వు వస్తుంటుంది. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పబ్లిక్ టాయిలెట్స్‌ను నిర్మించిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘పేరుకు తగ్గట్టే పబ్లిక్ టాయిలెట్స్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. పబ్లిక్ టాయిలెట్స్ (Public toilets) నిర్మించిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా ఒక్కో గదిలో ఒక కమోడ్‌ను మాత్రమే ఏర్పాటు చేస్తారు. అయితే పబ్లిక్ టాయిలెట్స్ అనే పేరుకు నిలవెత్తు సాక్ష్యం చూపించాలని అనుకున్నారో ఏమో గానీ.. బాత్రూం కమోడ్‌లను ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఏర్పాటు చేశారు.
Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..
రేకుల షెడ్డు నిర్మించి, అందులో ఓ వైపు వరుసగా బాత్‌రూం కమోడ్‌లు (Bathroom Commodes) పెట్టారు. వాటికి ఎదురుగా మరో వైపు కూడా అలాగే ఏర్పాటు చేశారు. ఇలా సామూహికంగా బాత్రూం కమోడ్‌లను ఏర్పాటు చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సామూహిక మరుగుదొడ్లు అంటే ఇవేనేమో’’.. అంటూ కొందరు, ‘‘మరుగుదొడ్లు ఇలాక్కూడా నిర్మించవచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలా నిర్మించారేంట్రా బాబోయ్..అదేమైనా సమావేశ మందిరమా’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11వేలకు పైగా లైక్‌లు, 9.50 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Biker Viral Video: సాటి బైకర్‌కే ఇతడి బాధ అర్థమవుతుంది.. ఎలాంటి సమస్య వచ్చిందో మీరే చూడండి..
ఇవి కూడా చదవండి..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..