Share News

Jugaad Viral Video: ఈ అల్మారాలోని నగదు కొట్టేయడం అసాధ్యం.. దొంగలకు ఎలా షాకిచ్చాడో చూడండి..

ABN , Publish Date - Apr 23 , 2025 | 09:42 PM

ఓ వ్యక్తి తన ఇంట్లోని పెద్ద అల్మారాలో చిన్న కప్ బోర్డ్‌ను ఏర్పాటు చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. కప్ బోర్డును సాధారణంగా ఏర్పాటు చేస్తే దొంగలు కనిపెడతారు అనుకున్నాడో ఏమోగానీ.. ఇతనేమో విచిత్రంగా ఆలోచించాడు..

Jugaad Viral Video: ఈ అల్మారాలోని నగదు కొట్టేయడం అసాధ్యం.. దొంగలకు ఎలా షాకిచ్చాడో చూడండి..

దొంగలు రోజురోజుకూ తెలివిమీరిపోతున్నారు. బలమైన తాళాలు వేసినా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా, అత్యాధునిక రక్షణ చర్యలు తీసుకున్నా కూడా ఏదో విధంగా చోరీ చేసేస్తున్నారు. దీంతో దొంగల కంటపడకుండా నగదును దాచేందుకు చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లో అల్మారాను సెట్ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ అల్మారాలో నగదు కొట్టేయడం అసాధ్యం’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లోని పెద్ద అల్మారాలో చిన్న కప్ బోర్డ్‌ను ఏర్పాటు చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. కప్ బోర్డును సాధారణంగా ఏర్పాటు చేస్తే దొంగలు కనిపెడతారు అనుకున్నాడో ఏమోగానీ.. ఇతనేమో విచిత్రంగా ఆలోచించాడు. అల్మారా మధ్యలో ఓ విద్యుత్ బోర్డు ఏర్పాటు చేశాడు.

Bees Viral Video: మృత్యువును ముట్టుకోవడమంటే ఇదే.. ఇతను చేస్తున్న నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..


ఆ బోర్డుపై రెండు స్విచ్‌లో పాటూ మూడు సాకెట్లను కూడా ఏర్పాటు చేశాడు. అయితే ఇది నిజంగా విద్యుత్ బోర్డు అని అనుకుంటే (cupboard made look like an electrical board) మీరు కరెంట్‌లో కాలేసినట్లే. ఎందుకంటే చూసేందుకు మాత్రమే ఇది విద్యుత్ బోర్డు. అందులోని సాకెట్ రంధ్రలో తాళం చెవి పెట్టి తిప్పగానే అది ఒక కప్‌బోర్డ్ అని తెలిసిపోతుంది. అందులో నగలు, నగదును పెట్టి తాళం వేస్తే ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుందనేది అతడి ఉద్దేశం.

Viral Video: తయారీదారులకే షాక్ ఇచ్చాడుగా.. లామినేషన్ మిషన్‌ను ఎలా వాడారంటే..


ఇలా కప్‌బోర్డ్‌ను కరెంట్ బోర్డు తరహాలో ఏర్పాటు చేసిన ఇతడి తెలివితేటలు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కప్‌బోర్డులో నగదు కొట్టేయడం అసాధ్యం’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Funny Viral Video: మీ వీధులు సల్లగుండ.. ఎండ వేడి తగలకుండా వీళ్లు చేసిన పని చూడండి..


ఇవి కూడా చదవండి..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 23 , 2025 | 09:42 PM