Hippopotamus VS Crocodile: నీటి ఏనుగు పవర్ మామూలుగా లేదుగా.. మొసలిని ఎలా భయపెట్టిందో చూస్తే..
ABN , Publish Date - Apr 21 , 2025 | 09:46 PM
ఓ మొసలి నీటి ఒడ్డున వేట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో లోపలి నుంచి పెద్ద నీటి ఏనుగు బయటికి వస్తుంది. నీటి ఏనుగును చూడగానే మొసలి నోరు తెరచి కొరికే ప్రయత్నం చేస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

నీటిలో ఉన్న మొసలికి ఎంత పవర్ ఉంటుదో అందరికీ తెలుసు. అలాగే నీటి ఏనుగుకూ అంతే స్థాయిలో బలం ఉంటుందనేది అందరికీ తెలుసు. అందుకే నీటిలో ఉన్న సమయంలో వీటి జోలికి ఏం జంతువు కూడా వెళ్లే సాహసం చేయదు. అయితే ఈ రెండింటి మధ్య ఫైట్ జరిగితే ఎలా ఉంటుంది.. అనే సందేహం రావచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘నీటి ఏనుగు పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మొసలి నీటి ఒడ్డున వేట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో లోపలి నుంచి పెద్ద నీటి ఏనుగు బయటికి వస్తుంది. నీటి ఏనుగును చూడగానే మొసలి నోరు తెరచి కొరికే ప్రయత్నం చేస్తుంది. మొసలి దాడి చేయడం చూసి నీటి ఏనుగు అలెర్ట్ అవుతుంది.
మొసలికి పోటీగా మరింత గట్టిగా నోరు తెరచి శబ్ధం చేస్తుంది. నీటి ఏనుగు నోరు తెరిచి శబ్ధం చేయగానే (Hippopotamus scared the crocodile) మొసలి భయంతో వణికిపోతుంది. ‘‘ఈ నీటి ఏనుగుతో పెట్టుకోవడం కంటే పారిపోవడం బెటర్’’.. అని అనుకుంటూ అక్కడి పారిపోతుంది. ఈ ఘటన పర్యాటకుల సమక్షంలోనే జరుగుతుంది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Viral Video: సమయస్ఫూర్తి అంటే ఇదేనేమో.. కోపంగా దగ్గరికొచ్చిన బైకర్‌ను.. ఎలా కూల్ చేశాడో చూస్తే..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నీటి ఏనుగు పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘మొసలికి చుక్కలు చూపించిన నీటి ఏనుగు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 13. 7 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..