Share News

Animals Funny Video: పోట్లాడుకుంటున్న ఎద్దులు.. మధ్యలో దూరిన కుక్క.. చివరకు పొట్ట చెక్కలయ్యే ఫన్నీ సీన్..

ABN , Publish Date - Apr 21 , 2025 | 03:50 PM

రెండు ఎద్దుల మధ్యలో ఉన్నట్టుండి ఫైట్ మొదలవుతుంది. రోడ్డుపై ఆ ఎద్దులు కొమ్ములతో ఢీకొట్టుకుంటూ అటూ, ఇటూ తిరుగుతుంటాయి. దీంతో సమీపంలోని వారంతా దూరంగా పారిపోయారు. అయితే ఓ కుక్క వాటి మధ్యలోకి దూరుతుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Animals Funny Video: పోట్లాడుకుంటున్న ఎద్దులు.. మధ్యలో దూరిన కుక్క.. చివరకు పొట్ట చెక్కలయ్యే ఫన్నీ సీన్..

జంతువుల మధ్య కొన్నిసార్లు సినిమా తరహా ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్ని జంతువులు మనుషుల తరహాలో ప్రవర్తిస్తూ నవ్విస్తుంటే.. మరికొన్ని జంతువులు చేసే పనులు అంతా తెగ నవ్వుకునేలా ఉంటాయి. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రెండు ఎద్దులు పోట్లాడుకుంటుండగా ఓ కుక్క మధ్యలో దూరింది. చివరకు జరిగిన చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ కుక్క పెద్ద పంచాయితీ చేసిందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రెండు ఎద్దుల మధ్యలో (Bulls fighting on the road) ఉన్నట్టుండి ఫైట్ మొదలవుతుంది. రోడ్డుపై ఆ ఎద్దులు కొమ్ములతో ఢీకొట్టుకుంటూ అటూ, ఇటూ తిరుగుతుంటాయి. దీంతో సమీపంలోని వారంతా దూరంగా పారిపోయారు. అయితే ఓ కుక్క మాత్రం వాటి సమీపానికి వెళ్లింది. వాటి గొడవను పరిష్కరించాలని చూస్తుంది.

Sheep Funny Viral Video: కర్మ కమ్ బ్యాక్ అంటే ఇదేనేమో.. ఈ పొట్టేలు చేసిన పని చూస్తే..


అయితే కుక్క రావడంతో దూరంగా జరిగిన ఎద్దులు కాసేపు ఆగిన తర్వాత మళ్లీ పోట్లాడుకుంటాయి. దీంతో కుక్క (Dog) మళ్లీ పరుగు పరుగున వాటి మధ్యలోకి పరుగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా మొరుగుతుంది. ‘‘గొడవపడొద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి.. వెళ్లండి దూరంగా’’.. అన్నట్లుగా వాటిపై సీరియస్ అవుతుంది. దీంతో ఆ ఎద్దులు దూరంగా వెళ్లిపోతాయి. ఇలా ఎద్దుల పోట్లాడుకున్న ప్రతిసారీ ఆ కుక్క ఎంతో ఓపికగా వాటి గొడవను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది.

Funny Viral Video: ఇదేం వింత పరీక్షరా నాయనా.. వాషింగ్ మెషిన్‌లో రాయి వేయడంతో.. చివరకు..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వారి ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎద్దుల పాలిట పెదరాయుడిలా మారిన కుక్క’’.. అంటూ కొందరు, ‘‘ఈ కుక్క మనసు చాలా గొప్పది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 76 వేలకు పైగా లైక్‌లు, 1.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Watch Viral Video: వేసవిలో తాటి కాయలు తెగ తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 21 , 2025 | 03:50 PM