Marriage funny video: దండ వేయించుకోని వరుడికి దడ పుట్టించిందిగా.. ఎలా భయపెట్టిందో చూస్తే..
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:37 PM
ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు దండలు మార్చుకుంటుంటారు. అయితే ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఘటన అందరినీ తెగ నవ్విస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వరుడికి ముట్టుకోకుండానే వణికించిందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు...తప్పెట్లు..తాళాలు.. తలంబ్రాలు.. ఇది ఒకప్పటి పాట.. కానీ ఇప్పటి పెళ్లిళ్లలో.. పందిళ్లు, సందళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలతో పాటూ ఫన్నీ ప్రాంక్‌లు, రీల్స్ వీడియోలు కూడా భాగమైపోయాయి. ఎక్కడ ఏ పెళ్లి జరిగినా.. అందులో ఏదో ఒక సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా, ఓ వివాహంలో చోటు చేసుకున్న తమాషా సంఘటన వీడియో చక్కర్లు కొడుతోంది. దండ వేయించుకోని వరుడిని వధువు భయపెట్టిన తీరు చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో వధూవరులు (Bride and groom) దండలు మార్చుకుంటుంటారు. అయితే ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఘటన అందరినీ తెగ నవ్విస్తోంది. వధూవరులు చేతిలో పూల దండలు పట్టుకుని సిద్ధంగా ఉంటారు. ముందుగా వధువు వంతు వస్తుంది. వరుడి మెడలో దండ వేసేందుకు వధువు ప్రయత్నిస్తుంది.
Stork Viral Video: మైఖేల్ జాక్సన్ ఫాలో అవుతున్న కొంగ.. ఎలా నీళ్లు తాగుతుందో చూస్తే..
అయితే దండ వేయాలని చూడగా.. వరుడి వెనుక వైపు ఉన్న యువకుడు అతన్ని లాగేస్తాడు. దీంతో వధువుకు దండ వేయడం కష్టంగా మారుతుంది. ఎన్నిసార్లు దండ వేయాలని ప్రయత్నించినా.. ఆ యువకుడు వరుడిని వెనక్కు లాగుతుంటాడు. దీంతో చివరకు వధువుకు చిర్రెత్తుకొస్తుంది. తన చేతిలోని పూల దండను వెనుక ఉన్న వారికి ఇచ్చి, వరుడి స్నేహితుడిని (Bride attacks groom's friend) వంగోబెట్టి ఒక్క గుద్దు గుద్దుతుంది. దెబ్బకు అతడికి చుక్కలు కనిపిస్తాయి.
Woman Viral Video: బురఖా మహిళపై అనుమానం.. లోపల పరిశీలించగా దిమ్మతిరిగే సీన్..
వధువు విచిత్ర ప్రవర్తనతో వరుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వరుడికి భలే షాక్ ఇచ్చిందిగా’’.. అంటూ కొందరు, ‘‘పెళ్లి తర్వాత వరుడి పరిస్థితి తలుచుకుంటే జాలేస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 లక్షలకు పైగా లైక్‌లు, 15.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Watch Viral Video: వేసవిలో తాటి కాయలు తెగ తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..
Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..