Share News

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Apr 18 , 2025 | 01:32 PM

ఓ పులికి బాగా ఆకలి వేయడంతో వేట కోసం ఎంతో వెతికింది. అయితే సమయానికి దానికి ఎలాంటి జంతువూ కనిపించలేదు. ఈ క్రమంలో చనిపోయిన కొండచిలువ కనిపించింది. అయితే దాన్ని తినగానే పులికి కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. చివరకు ఏమైందో మీరే చూడండి..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

పులి వేట ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పులి ఎంట్రీ ఇచ్చిందంటే చాలు.. ఒక ఆ ప్రాంతంలో ఉన్న జంతువులన్నింటికీ ఇబ్బందులు మొదలైనట్లే. అలాంటిది వేటాడిన తర్వాత పులికే ఇబ్బందులు ఎదురైతే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా. ఇలాంటి విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పులి చనిపోయిన కొండచిలువను తినేసింది. తర్వాత ఏం జరిగిందో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అరేరే.. ఈ పులికి పెద్ద సమస్యే వచ్చిందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పులికి బాగా ఆకలి వేయడంతో వేట కోసం ఎంతో వెతికింది. అయితే సమయానికి దానికి ఎలాంటి జంతువూ కనిపించలేదు. ఈ క్రమంలో చనిపోయిన కొండచిలువ కనిపించింది. దాన్ని చూడగానే ఈ పూటకు ఈ కొండచిలువను కానిద్దాం.. అని అనుకుందో ఏమో గానీ.. (Tiger eating dead python) నేరుగా వెళ్లి తినేసింది.

Optical illusion: చురుకైన కళ్లు ఉన్నవారు మాత్రమే.. ఈ చిత్రంలో దాక్కున్న ఈకను 10 సెకన్లలో గుర్తించగలరు..


అయితే కొండచిలువను తిన్న తర్వాత దాని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తీవ్ర అసౌకర్యానికి గురైన పులి.. వాంతులు చేసుకుంది. ఆ తర్వాత అక్కడే ఉన్న గడ్డిని తింటూ తన నోటిని, కడుపును రీఫ్రెష్ చేసుకుంది. ఇలా చాలా సేపు ఆ పులి గడ్డి తింటూ అక్కడక్కడే తిరుగుతూ ఉంది. ఆ సమయంలో పులి బాగా ఇబ్బంది పడినట్లు కనిపించింది. ‘‘ఈ కొండచిలువను తిని పెద్ద తప్పు చేశాను.. బుద్ధుంటే ఇంకోసారి ఇలాంటి పని చేయొద్దు’’.. అన్నట్లుగా ఆ పులి ప్రవర్తన ఉంటుంది.

Stork Viral Video: వేటాడడంలో దీని తర్వాతే ఎవరైనా.. ఎలుకను ఎలా ఎత్తుకెళ్లిందో చూస్తే..


ఇలా పులికి విచిత్ర సమస్య ఎదురవడం చూసి అక్కడే ఉన్న పర్యాటకులు తెగ నవ్వుకున్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరెరే.. ఈ పులికి పెద్ద కష్టమే వచ్చిందే’’.. అంటూ కొందరు, ‘‘పులికి కూడా అజీర్ణ సమస్యలు ఉన్నాయేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 100కి పైగా లైక్‌లు, 40 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Train Accident Video: ఇలాంటి పని ఎవరూ చేయొద్దు.. రైలుపై యువకుడి వాకింగ్.. చివరకు అతడి పరిస్థితి..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 18 , 2025 | 01:32 PM